లాభాలను నమోదు చేసిన మార్కెట్లు

by  |
Stock market
X

దిశ, వెబ్‌డెస్క్: ఒడిదుడుకుల మధ్య గత వారాంతం లాభాలను ఇచ్చిన దేశీయ ఈక్విటీ మార్కెట్లు ఈ వారం కూడా లాభాలను దక్కించుకున్నాయి. అమెరికా మార్కెట్ల సంకేతాలతో, ఆసియా మార్కెట్లు లాభాలను చూడటం వల్ల దేశీ మార్కెట్ల సెంటిమెంట్‌ బలపడిందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడ్డారు. ఉదయం నుంచే మదుపర్లు కొనుగోళ్లకు సిద్ధమవడం వల్ల మార్కెట్లు సానుకూలంగా కదలాడాయి.

అలాగే, దేశంలో వినోద రంగానికి ఊరటనిచ్చేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో మార్కెట్లలో జోరు ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 364.36 పాయింట్ల లాభంతో 38,799 వద్ద ముగియగా, నిఫ్టీ 94.85 పాయింట్లు ఎగిసి 11,466 వద్ద ముగిసింది. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగం షేర్లు పుంజుకోవడం మార్కెట్లకు కలిసొచ్చాయి. నిఫ్టీలో ప్రైవేట్ బ్యాంకులు షేర్లు కళకళలాడాయి. మీడియా రంగం స్వల్పంగా పుంజుకోగా, ఫార్మా, రియల్టీ, ఐటీ రంగాలకు నష్టాలు తప్పలేదు.

సెన్సెక్స్ ఇండెక్స్‌లో కోటక్ బ్యాంక్ (kotak bank), ఇండస్ఇండ్ బ్యాంక్ (indusind bank), బజాజ్ ఫైనాన్స్ (bajaj finance), హెచ్‌డీఎఫ్‌సీ (hdfc), ఐసీఐసీఐ బ్యాంక్ (icici bank), బజాజ్ ఫిన్‌సర్వ్ (bajaj finserv), ఎస్‌బీఐ (sbi), మారుతీ సుజుకి (maruti suzuki), హెచ్‌డీఎఫ్‌సీ (hdfc), భారతీ ఎయిర్‌టెల్ (bharti airtel), యాక్సిస్ బ్యాంక్ (axis bank) షేర్లు అధిక లాభాల్లో ట్రేడవ్వగా… పవర్‌గ్రిడ్ (powergrid), ఎంఅండ్ఎం (M&M), టెక్ మహీంద్రా (tech mahindra), టైటాన్ (titan), ఎన్‌టీపీసీ (ntpc), బజాజ్ ఆటో (bajaj auto), హిందూస్తాన్ యూనిలీవర్ (Hindustan Unilever), అల్ట్రా సిమెంట్ (ultra cement) షేర్లు అధిక నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 74. 34 వద్ద ఉంది.



Next Story

Most Viewed