ప్రేమ పేరుతో వేధించాడు.. ఒప్పుకోలేదని దారుణానికి ఒడిగట్టాడు

by  |
ప్రేమ పేరుతో వేధించాడు.. ఒప్పుకోలేదని దారుణానికి ఒడిగట్టాడు
X

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బీటెక్ విద్యార్థిని రమ్య శ్రీ హత్య కేసులో ముద్దాయిని గుంటూరు అర్బన్ పోలీసులు మీడియా ముందు హాజరుపరిచారు. రమ్యకు ముద్దాయి కుంచాల శశికృష్ణకు ఇన్ స్టాగ్రామ్‌లో గత 6 నెలల క్రితం పరిచయం ఏర్పడిందని ఇన్‌చార్జ్ డీఐజీ రాజశేఖర్ తెలిపారు. అయితే అప్పటి నుండి శశికృష్ణ ..రమ్యను ప్రేమ పేరుతో వేధించేవాడని తెలిపారు. సెయింట్ మేరీస్ ఇంజనీరింగ్ కాలేజీ వద్దకు వెళ్లి ప్రేమ పేరుతో వేధించేవాడని దీంతో ఆమె అతడిని దూరం పెట్టిందని తెలిపారు. నెలరోజుల క్రితం అతడిని ఇన్ స్టాగ్రామ్‌లో బ్లాక్ చేసినట్లు తెలిపారు. అయితే ఫోన్ చేసి ప్రేమించకపోతే చంపేస్తానని బెదిరించేవాడని తమ విచారణలో తేలిందన్నారు.

ఆదివారం ఆమెతో మాట్లాడేందుకు వచ్చాడని వస్తూ కత్తిని కూడా వెంటబెట్టుకున్నాడని..తన ప్రేమను అంగీకరించాలని కోరాడని అందుకు ఆమె ఒప్పుకోకపోవడంతో ఇద్దరి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొందన్నారు. చివరకు శశికృష్ణ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని తెలిపారు. ఇన్ స్టాగ్రామ్‌లో కుంచాల శశికృష్ణ పరిచయం. గతంలో శశికృష్ణ మెకానిక్‌గా పనిచేసేవాడని ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాడని తమ విచారణలో తేలిందన్నారు. గతంలో ఇతడికి ఎలాంటి నేరచరిత్ర లేదని ఇన్ చార్జ్ డీఐజీ రాజశేఖర్ తెలిపారు. తాను స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో డ్యూటీలో ఉన్నానని ఘటన జరిగిన వెంటనే అప్రమత్తమైనట్లు గుంటూరు అర్బన్ ఎస్పీ ఆరీఫ్ హఫీజ్ తెలిపారు. వెంటనే బాధిత కుటుంబాన్ని కలిశామని..అనుమానితుల వివరాలను అడిగి తెలుసుకున్నట్లు తెలిపారు. అనంతరం సీసీ ఫుటేజ్, స్థానికుల సమాచారంతో ముద్దాయిని గంటల వ్యవధిలోనే పట్టుకున్నామన్నారు. ఇందులో పోలీసుల అలసత్వం లేదని చెప్పుకొచ్చారు. శశికృష్ణ వేధింపుల విషయాన్ని రమ్య తల్లిదండ్రులకు, సోదరికి చెప్పలేదని అన్నారు. మహిళలపై దాడులు చేసే వారికి కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామని ఆరీఫ్ హఫీజ్ తెలిపారు.



Next Story

Most Viewed