సేవాలాల్ సేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వెంకన్న నాయక్

by  |
Dharavat Venkanna Nayak
X

దిశ, మహబూబాబాద్: హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో ‘సేవాలాల్ సేన’ రాష్ట్రస్థాయి సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మహబూబాబాద్ జిల్లా శనిగపురం శివారు గుండ్లబోడు తండాకు చెందిన ధారవత్ వెంకన్న నాయక్‌ను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ‘సేవాలాల్ సేన’ వ్యవస్థాపక అధ్యక్షులు భూక్య సంజీవ్ నాయక్, రాష్ట్ర అధ్యక్షులు అంగోత్ రాంబాబు నాయక్‌లు నియామక పత్రం అందజేశారు.

కాగా, వెంకన్న చిన్ననాటి నుంచి ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొంటూ అనేక ఉద్యమాలు చేశారని సంఘం నాయకులు అభినందించారు. ఎల్‌హెచ్‌పీఎస్ మండల అధ్యక్ష పదవి నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లాకు 2015 నుండి దాదాపు 11 సంవత్సరాల పాటు అధ్యక్షుడిగా పనిచేసి, జాతి ఐక్యత కోసం కృషి చేశారని కొనియాడారు. తీజ్ పండుగను అందరూ ఒకేరోజు చేసుకునేలా ఉద్యమించిన జాతి బిడ్డ వెంకన్న నాయక్ అన్నారు.

రెండు నెలలుగా జిల్లాలోని అన్ని తండాల్లో ‘‘తండా బాట’’ కార్యక్రమాన్ని చేపట్టి సమస్యలు పరిష్కరించాలని కోరారు. మానుకోటను జిల్లాగా ప్రకటించాలని రైల్వే ట్రాక్‌లోని కంకర రాళ్లకు పూజలు చేశారు. ఇలా అనేక ఉద్యమాలు చేసిన అనుభవం ఉన్న వెంకన్న నాయక్ సేవలు రాష్ట్రానికి అవసరం అని గుర్తించి ఈ పదవి ఇవ్వడం అభినందనీయమని హర్షించారు.


Next Story

Most Viewed