KCR సర్కార్ నిర్వాకం.. స్కూల్స్‌లో నో వాటర్, నో టాయిలెట్స్..

by  |
kcr-and-ts-map
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో కనీస వసతులు కరువయ్యాయి. కనీసం టాయిలెట్లు, మంచినీటి వసతి కూడా కల్పించలేకపోవడం గమనార్హం. తెలంగాణలో టాయిలెట్లు పనిచేయని పాఠశాలలు 1,255 ఉన్నట్లుగా రాజ్యసభలో జలశక్తిశాఖ మంత్రి వెల్లడించడం విశేషం. వీటిలో రూరల్​ఏరియాల్లోని 1,195 స్కూళ్లలో టాయిలెట్లు పనిచేయకపోగా అర్బన్​ఏరియాల్లోని 60 పాఠశాలల్లో మరుగుదొడ్ల వసతి లేదని పేర్కొన్నది. 2021‌‌-22కు గాను ఈ ఏడాది డిసెంబర్​1 నాటికి రాష్ట్రాలు ఇచ్చిన ఇంటిగ్రేటెడ్ మేనేజ్‌మెంట్​రిపోర్టులో ఇవి నమోదయ్యాయి. అంగన్వాడీలు, ప్రభుత్వ పాఠశాలల్లో నీటి నాణ్యత పరీక్షల కోసం జలశక్తిశాఖ నిర్వహించిన 47,022 పరీక్షల్లో ఈ విషయం తేటతెల్లమైంది.

లక్ష్యం చేరని మిషన్ భగీరథ..

ప్రజలకు తాగునీటి కష్టాలు తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మిషన్​భగీరథ పథకాన్ని తీసుకొచ్చింది. రూ.40 వేల కోట్లను ఈ ప్రాజెక్టుకు వెచ్చించింది. అయినా ప్రభుత్వ లక్ష్యం నీరుగారిపోయింది. కనీసం ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లకు కూడా అందించలేకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని పాఠశాలలకు మాత్రమే నీరందుతోంది. గవర్నమెంట్​ఆఫీసుల్లో ఇప్పటికీ ప్యాకేజ్‌డ్​వాటర్‌నే వినియోగిస్తున్నారు. ఇందుకు ప్రతీనెలా బిల్లులు పెట్టుకుంటున్నారు. ఈ బిల్లులే కోట్లలో ఉండటం గమనార్హం. మిషన్​భగీరథ లక్ష్యం నెరవేరకపోవడంతో వేల కోట్లు వృథా అయ్యాయనే విమర్శలు వస్తున్నాయి.

బోరు బావుల నీరే దిక్కు..

ఇప్పటికే కొవిడ్ కారణంగా విద్యార్థులు పాఠశాలలకు రావాలంటేనే జంకుతున్నారు. కొవిడ్ దరిచేరకుండా కనీసం ఎప్పటికప్పుడు హ్యాండ్​వాష్​ చేసుకునేందుకు సైతం పలు పాఠశాలల్లో నీటి సౌకర్యం లేకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. గతంలో తాగునీరు కల్తీ కావడంతో ఎందరో విద్యార్థులు అనారోగ్యం బారిన పడిన సందర్భాలు కోకొల్లలు. మిషన్​భగీరథ పనులు ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో పూర్తికాకపోవడం వల్లే ఈ పరిస్థితి ఎదురవుతోందని పలువురు చెబుతున్నారు. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లోని ప్రభుత్వ స్కూల్స్‌లో బావుల నుంచి పాఠశాలలకు పైపుల ద్వారా నీరు తెచ్చుకుంటున్న పరిస్థితి తలెత్తింది. అత్యధికంగా 192 స్కూళ్లలో టాయిలెట్లు పనిచేయని జిల్లాగా ఆసిఫాబాద్ కొమురం భీం జిల్లా మొదటి స్థానంలో ఉండగా.. 112 స్కూళ్లతో ఆదిలాబాద్​ రెండో స్థానంలో ఉంది. హ్యాండ్​వాష్​ సౌకర్యం లేని 819 స్కూళ్లు కలిగిన జిల్లాగా ఆదిలాబాద్​ ఫస్ట్‌లో ఉంది.

1. రాష్ట్రంలో టాయిలెట్లు పనిచేయని పాఠశాలల సంఖ్య మొత్తం = 1255
= రూరల్​ఏరియాల్లో = 1195
= అర్బన్​ఏరియాల్లో = 60

2. హ్యాండ్​వాష్​సౌకర్యం లేని పాఠశాలలు మొత్తం = 11,974
= రూరల్​ఏరియాల్లో = 10,390
= అర్బన్​ఏరియాల్లో = 1584

3. చేతిపంపుపై ఆధారపడిన స్కూళ్లు మొత్తం = 9421
= రూరల్​ఏరియాల్లో = 8545
= అర్బన్​ఏరియాల్లో = 876

4. రక్షణ కలిగిన బావులపై ఆధారపడిన స్కూళ్లు మొత్తం = 515
= రూరల్​ఏరియాల్లో = 444
= అర్బన్​ఏరియాల్లో = 71

5. రక్షణ లేని బావులపై ఆధారపడిన బడులు మొత్తం = 38
= రూరల్​ఏరియాల్లో = 31
= అర్బన్​ఏరియాల్లో = 7

6.ట్యాప్​వాటర్​సౌకర్యం కలిగిన స్కూళ్లు మొత్తం = 16,116
= రూరల్​ఏరియాల్లో = 12947
= అర్బన్​ఏరియాల్లో = 3169

7.ప్యాకేజ్​డ్ లేదా బాటిల్​వాటర్​ను వినియోగిస్తున్న స్కూళ్లు మొత్తం = 1780
= రూరల్​ఏరియాల్లో = 1378
= అర్బన్​ఏరియాల్లో = 402

8.ఇతర మార్గాలపై ఆధారపడిన స్కూళ్ల సంఖ్య = 5214
= రూరల్​ఏరియాల్లో = 4209
= అర్బన్​ఏరియాల్లో = 1005.



Next Story

Most Viewed