తెలంగాణలో స్కూళ్లు ఓపెన్ అప్పుడే..

by  |
తెలంగాణలో స్కూళ్లు ఓపెన్ అప్పుడే..
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారి విస్తృత వ్యాప్తి కారణంగా లాక్‌డౌన్ విధించడంతో రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్లు మూతపడిన విషయం తెలిసిందే. అయితే దాదాపు తొమ్మిది నెలలు గడుస్తున్నా స్కూళ్ల రీ ఓపెనింగ్‌పై స్పష్టత రాకపోవడం విద్యార్థుల తల్లితండ్రుల్లో ఆందోళన కలుగజేస్తోంది. అయితే ఇప్పటికే ఆలస్యం అయినందున పాఠశాలల పున:ప్రారంభానికి విద్యాశాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. ఇందులో భాగంగానే సంక్రాంతి తర్వాత నుంచి స్కూల్స్ రీ-ఓపెన్ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రతిపాదనలను సీఎం కేసీఆర్‌కు పంపించింది. స్కూల్స్ తెరిచి మొదటిగా 9,10 తరగతుల విద్యార్థులకు క్లాసులు ప్రారంభించాలని.. ఆ తర్వాత దశల వారీగా మిగతా క్లాసులు స్టార్ట్ చేయనున్నారు. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి సెలవులు వరుసపెట్టి ఉండటంతో.. జనవరి నెలాఖరు దాకా స్కూల్స్ తెరవకూడదని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.



Next Story

Most Viewed