తొలి స్థానంలో ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్స్!

by  |
తొలి స్థానంలో ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్స్!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుబంధ సంస్థ ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్స్ ఇప్పుడు దేశీయంగా ఉన్న అతిపెద్ద మ్యూచువల్ ఫండ్స్ కంపెనీ అని అసోసియేషన్ ఆఫ్ మ్యూచివల్ ఫండ్స్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. అత్యధిక ఆస్తులతో ఇప్పటివరకూ హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్ ఫండ్స్ మొదటి స్థానంలో ఉండేది. 2019 డిసెంబర్ వరకూ ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్స్ రూ. 3,52,632 కోట్లతో మూడో స్థానంలో ఉండగా, ఈ ఏడాది మార్చి నాటికి ఈ సంస్థ ఆస్తుల విలువ రూ. 3.73 లక్షల కోట్లకు పెరిగింది. 6 శాతం పెరుగుదల నమోదు చేసిన ఈ సంస్థ మొదటిస్థానంలో రాగా, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసిఐసిఐ మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు మిగిలిన రెండు మూడు స్థానాల్లో ఉన్నాయి.

హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్ ఫండ్స్ ఆస్తుల విలువ 3.3 శాతం క్షీణించి రూ. 3.69 కోట్లకు తగ్గింది. అలాగే, ఐసిఐసిఐ మ్యూచువల్ ఫండ్స్ ఆస్తుల విలువ 2.9 శాతం తగ్గి రూ. 3.51 శాతానికి తగ్గింది. ఇక, మిగిలిన సంస్థల వివరాలు పరిశీలిస్తే…ఆదిత్యా బిర్లా సన్‌లైఫ్ మ్యూచువల్ ఫండ్స్ విలువ రూ. 2.47 లక్షకల కోట్లు, నిపాన్ ఇండియా మ్యూచువల్ ఫండ్స్ విలువ రూ. 2.04 లక్షల కోట్లు ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి.

Tags: Mutual Funds, AMFI, sbi mutual funds, sbi mf



Next Story

Most Viewed