ట్రెండింగ్​.. శారీ వియర్​ ఛాలెంజ్​ !

by  |
ట్రెండింగ్​.. శారీ వియర్​ ఛాలెంజ్​ !
X

– సోషల్​ మీడీయాలో మహిళల ట్రెండ్

​దిశ, న్యూస్ ​బ్యూరో: కరోనా వైరస్ (కోవిడ్ 19) మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. ఎవరి మనసులో చూసినా కరోనా భయాలే.. గట్టిగా నవ్వాలన్నా వైరస్​ భయాలతో అందరి మొహాల్లో కళ పోయింది. ఎక్కడో ఒక చోట బ్రేకింగ్​ రావాలని ఎవరికో పుట్టిందో ఓ ఆలోచన. అదిప్పుడు సోషల్​ మీడీయాలో ట్రెండింగ్​లో ‘Saree clad Challenge’గా మారింది.

లాక్​డౌన్​ విధించిన తర్వాత ప్రజలంతా నాలుగు గోడలకు పరిమితమయ్యారు. కరోనా వార్తలు, ఆందోళనలతో ఎవరిని కదిలించినా చిరునవ్వు జాడలు లేకుండా పోయింది. సంతోషం, నవ్వులు కనిపించడం లేదు. అందరూ మూఢీగా మారిపోయి ఎక్కడ చూసినా నిరుత్సాహం, పేలిపోయిన ముఖ ఛాయలు. తెలియని బాధ, మనసుల లోపల ఎక్కడో కనిపించని ఆందోళన, భయాలు అంతటా ఆవరించి ఉన్నాయి. దేశంలో ఎక్కడికక్కడా ఒకరికొకరు కలుసుకోకుండా చేశారు. లాక్​డౌన్​ విధించడం ద్వారా కరోనా వ్యాప్తిని నివారించాలన్న ప్రభుత్వ నిర్ణయం సత్పలితాలను ఇచ్చిన సూచనలు కనిపిస్తున్నాయి. ఏప్రిల్​ 14 తర్వాత లాక్​డౌన్​ ఎత్తివేసే పరిస్థితి ఉన్నట్టు కొందరు అంచనా వేస్తున్నారు.

విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు.. ఏ పనిచేసేవారైనా అందరూ ఇంటికే పరిమితమయిపోయారు. పది రోజులుగా నాలుగ్గోడల మధ్యే పరిమితమయిపోయి బోర్​ ఫీలవుతున్నారు. తాము నిర్బంధంలో శిక్ష అనుభవిస్తున్నామనీ, లేక తమకు ఏమైనా అనారోగ్యం చేసిందోనని ఒక్కోసారి అనుమానాలు కలుగుతున్నాయి. ఇంటికి పరిమితమై పిచ్చివాళ్లయిపోతామోననే భయం వేస్తోంది. ఇలాంటి నిశ్శబ్ద వాతావరణాన్ని పోగొట్టేలా సోషల్మీడీయాలో శారీ వియరింగ్​ ఛాలెంజ్​ నడుస్తోంది.

ఫొటోలు అప్‌లోడ్ చేయాలి..

ఫేస్ బుక్​, ట్విట్టర్​ ఖాతాల్లో తాము చీరలు ధరించిన సమయంలో దిగిన ఫొటోలను, వీడీయోలను అప్​లోడ్​ చేయాలని మిత్రులకు, బంధువులకు ఛాలెంజ్​ విసురుతున్నారు. ఫొటోలతో పాటు కొందరు తమలో ఉన్న డ్యాన్స్​ కళను కూడా చూపించేందుకు ప్రయత్నిస్తున్నారు. 30 సెకన్ల పాటు చీరలో డ్యాన్స్​ చేయడం లేదా తమకున్న ఇతర కళల ద్వారా నవ్వించే వీడియోలను అప్​లోడ్​ చేస్తున్నారు. కోవిడ్​ –19 నుంచి ప్రజల మనసులను మళ్లించడమే లక్ష్యమైనపుడు తమ ఆనందాలను ఇతరులతో పంచుకోవడానికి ఇబ్బందులేమీ లేవు కదా అని పలువురు అంటున్నారు.

గ్రీన్ ఛాలెంజ్‌ను మించిన ఆదరణ..

గ్రీన్​ ఛాలెంజ్​ను మించిన రేంజ్​లో శారీ క్లాడ్​ ఛాలెంజ్​కు లభిస్తోంది. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి మహిళలు స్పందిస్తున్నారు. యువతులు కూడా స్పందించి తాము మొదటిసారిగా చీరలు కట్టుకున్న ఫొటోలను తమ సోషల్​ మీడీయాల్లోని ఖాతాల్లో అప్​ లోడ్​ చేస్తున్నారు. తమ స్నేహితులను, బంధువులకు కూడా శారీ ఛాలెంజ్​ను విసురుతున్నారు. కరోనా నేపథ్యంలో నిరాసక్తత ఆవహించిన సందర్భంలో రిలాక్స్​ చేసేందుకు ఈ ఛాలెంజ్​ విసుతున్నామని కామెంట్​ చేస్తున్నారు. ‘ఆరు లేదా తొమ్మిది గజాల చీరలు కట్టుకునే నైపుణ్యం మీలో ఉందా.. అయితే, శారీ క్లాడ్​ ఛాలెంజ్​ను స్వీకరించండి. మిమ్మల్ని అడగలేదు అనుకోకండి.. శారీ ధరించండి, షేర్​ చేయండి’ అంటూ ఆహ్వానిస్తున్నారు. కొత్తగా శారీ కట్టుకోలేని వారు, తాము దిగిన పాత ఫొటోలను సోషల్​ మీడీయా ఖాతాల్లో పంచుకుంటున్నారు. ప్రపంచమంతా నిరాసక్తతతో విషాద వాతావరణంలో ఉండిపోయింది. ఉత్సాహాన్ని నింపే ఛాలెంజ్​లో మీరు భాగస్వాములు కావాలని పిలుపునిస్తున్నారు. కరోనా నింపిన భయంకర జ్ఞాపకాలను ఆనంద ప్రపంచంలోకి తీసుకొచ్చేందుకు మీరు సిద్ధం కావాలంటే.. వెంటనే మీరు చీరలు ధరించి ఫొటోలతో మిత్రులను, కుటుంబ సభ్యులకు ‘శారీ క్లాడ్​ ఛాలెంజ్​’ విసరండి.. ఇంకెందుకు ఆలస్యం !

Tags: social media, saree clad challenge, women, trending, corona, relax

Next Story

Most Viewed