సైకిల్‌పై రోడ్ సేఫ్టీ టూర్.. అతడి రాకతో వరంగల్‌లో స్పెషల్ ప్రోగ్రామ్

by  |
సైకిల్‌పై రోడ్ సేఫ్టీ టూర్.. అతడి రాకతో వరంగల్‌లో స్పెషల్ ప్రోగ్రామ్
X

దిశ, డైనమిక్ బ్యూరో : రోడ్డు భద్రతా నియమాలు ప్రతీ ఒక్కరూ పాటించాలని వరంగల్ రోడ్డు రవాణా శాఖ ఉప కమిషనర్ పురుషోత్తం అన్నారు. రోడ్డు సేఫ్టీపై అవగాహన కల్పిస్తూ సంతోష్ మిశ్రా అనే వ్యక్తి సైకిల్‌పై వరల్డ్ టూర్ ప్లాన్ చేసుకున్నాడు. అతడి పర్యటనలో భాగంగా నేడు సంతోష్ వరంగల్‌కి చేరుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న వరంగల్ రోడ్డు రవాణా శాఖ ఉప కమిషనర్ పురుషోత్తం.. మంగళవారం అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా పురుషోత్తం మాట్లాడుతూ.. రోడ్డు భద్రతపై దేశమంతా తిరిగి ప్రచారం చేయడం అభినందనీయమన్నారు. ప్రతీ ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్‌ని తెలుసుకొని తూచా తప్పకుండా పాటిస్తే, ఇతర వాహనదారులకు ప్రమాదం ఉండదని సూచించారు. ఈ కార్యక్రమానికి హాజరైన రిటైర్డ్ ఆర్టీవో విజయ్‌పాల్ రెడ్డి పీపీటీ ప్రజెంటేషన్ ద్వారా రోడ్డు సేఫ్టీపై అవగాహన కల్పించారు.

అనంతరం సంతోష్ మిశ్రా మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా అన్ని గ్రామాలు తిరుగుతూ ప్రజలకు రోడ్డు సేఫ్టీ‌పై అవగాహన కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ఎంత అవగాహన కల్పించినా ప్రజల్లో మార్పు రావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు సేఫ్టీ నిబంధనలు పాటించకపోవడంతో ఒకరు చేసిన తప్పుకు మరొకరు బలి అవుతున్నారన్నారని అన్నారు. అందుకే ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వరంగల్‌ ఆర్టీవో కార్యాలయం సిబ్బంది, పలువురు రోడ్డు సేఫ్టీ యాక్టివిస్ట్‌లు పాల్గొన్నారు.


Next Story

Most Viewed