సాండ్ మాఫియా… నీకూ.. నాకు సగం సగం..

by  |
సాండ్ మాఫియా… నీకూ.. నాకు సగం సగం..
X

దిశ, జడ్చర్ల : మిడ్జిల్, చిల్వేరు శివారులోని దుందుభి వాగు కేంద్రంగా ఇసుక దోపిడీ జరుగుతుంది. వాగులో మంజూరైన చెక్ డ్యాం నిర్మాణంలో భాగంగా తవ్విన గుంతల మాటున కొందరు లీడర్లు టిప్పర్ల సహకారం తో భారీ మొత్తంలో అక్రమార్జనకు కుట్ర చేస్తున్నారు. వాగులో నుండి నేరుగా కొత్తగా మట్టి రోడ్డును నిర్మింపజేసి, గుట్టుగా రాత్రి సమయాల్లో యంత్రాల సాయంతో ఇసుకను వాహనాల్లో నింపి ఇతర ప్రాంతాలకు అమ్మేస్తున్నారు. దీనిపై భారీగా ఆశ లు పెంచుకొని డబ్బులు కలెక్షన్ చేస్తున్నారు.వాగు పక్క రైతులుగా గుర్తింపున్న కొందరు లీడర్లు ఇసుకసురుల నుండి రూ. వేలు వసూలు చేస్తున్నారు.నిబంధనల ప్రకారం కొత్త ఇంటి నిర్మాణం కోసం ఇసుక అవరమైతే పాలమూరు సాండ్ పాలసీ కింద మీ సేవ లో దరఖాస్తు చేసుకొని ,ఎంపిక చేసిన వాహనం నుండి ఇసుకను సమకూ ర్చుకోవలసి ఉంది. ఇందుకు ప్రభు త్వం కుడ ఆన్ లైన్ విధానం అందుబాటులోకి తీసుకువచ్చింది.

ఇవేమీ పట్టని కొందరు లీడర్లు అనుమతులు లేకుండానే ఇసుకను అక్రమ రవాణ చేసేందుకు కుట్ర చేయడం మిడ్జిల్ లో రచ్చ రచ్చ చేస్తుంది.దీనిపై జిల్లా ఉన్నతాధికా రులకు ఫిర్యాదులు అందాయి కూడ. నిన్నమొన్నటి వరకు ఇసుక అక్రమ రవాణ చెయ్యొద్దన్న లీడర్లే ,ప్రస్తుతం అక్రమ రవాణాకు పచ్చ జెండ ఊపడం వెనుక ఉన్న రహస్యం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.రూ.5.5 కోట్లు వ్యయం చేసి మంజూరైన చెక్ డ్యాం నిర్మాణం దేవుడెరుగు కానీ,నది పరివాహకం రైతుల ఆందోళన వర్ణణాతీతం అయింది.పంట పొలాలకు ఆరాధ్యదైవం అనుకునే దుందుభి నుండి నిత్యం ఇసుకను తరలిస్తే , భూగర్భజలాల పై ప్రభా వం చూపగలదని ఆవేదన చెందు తున్నారు.ఈ క్రమంలోనే రైతుల అభిప్రాయా లు లెక్కలోకి తీసుకొని ఇసుక పాలసికి మద్దతు ఇవ్వాల్సిన లీడర్లు అడ్డదారిలో పోటీలు పడి ఇసుక సురులకు వంతపడుతున్నా రు.

ఆన్​లైన్​,ఆఫ్​లైన్​ దోపిడి..?

మిడ్జిల్​ మండల పరిధిలోని గ్రామాల్లో కొత్తగ ఇంటి నిర్మాణాలు చేపట్టిన లబ్దిదారుల పేరిట కొందరు ఇసుకాసురులు ఆన్​లైన్​,ఆఫ్​లైన్​ పేరిట ఇసుక దోపిడికి పాల్పడుతున్నట్లు దుందుబీ వాగు పరివాహ క రైతులు స్థానిక తహిసిల్దార్​ శ్రీనివాసులుకు పిర్యాదు చేశారు.పాలమూరు సాండ్​ పాలసీ పేరిట ఆన్​లైన్​ ఇసుక రవాణాను ప్రభుత్వం ప్రోత్సహిస్తుండగా,అదే అధనుగ చూసుకుని కొందరు అక్రమార్కు లు ఆఫ్​లైన్​ పేరిట మరింత దోపిడికి పాల్పడుతున్నట్లు అధికారులకు పిర్యాదులు అందినట్లు తెలిసిం ది.దీనిపై కూడ రేవేన్యూ,పోలీసు అధికారులు స్పందించవలసిన అవసరం ఎంతైన ఉంది.

ఛిల్వేర్ శివారులోనూ…

మిడ్జిల్ మండలం చిల్వేరు శివారు లో తిమ్మాజీపేట మండలం అవంచ ఇసుక మాఫియా లీడర్ ఒకరు భారీ వాహనాలను వినియోగించి ఇసుకను యధేచ్చగా అమ్ముకుంటున్నాడు. దీనిపై పరిసర ప్రాంతాల్లోని రైతులు ఫిర్యాదులు చేసిన పట్టించుకోవడం లేదు. పలు సందర్భాల్లో పోలీసులకు, మాఫియా లీడర్ కు మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వివాదం జరిగిం ది.మంగళవారం కూడ ఇదే తరహా ఘటన చోటుచేసుకుంది. జిల్లా మైనింగ్ ఏ డి విజయ్ కుమార్ సమక్షంలోనే ఆవంచ గ్రామానికి చెందిన ఓ మాఫియా లీడర్ పోలీసులపై చెయ్యి చేసుకునేంత పని చేశాడు.దీనిపై మిడ్జిల్ పోలీసులు కేసులు నమోదు చేశారు.పోలీసు,రెవెన్యూ శాఖ అధికారుల విధులకు ఆటంకం కలిగించారన్న కారణంతో ఇసుక మాఫియా లీడర్ ను అదుపులోకి తీసుకొని రీమాండ్ కు తరలించిన ట్లు ఎస్సై జయప్రసాద్ తెలిపారు.

Next Story

Most Viewed