మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో ఊహించని ట్విస్ట్..

by  |
మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో ఊహించని ట్విస్ట్..
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రముఖ గాయకుడు సాయి చందును ఎంపిక చేశారు. మక్తల్ నియోజకవర్గంలోని అమరచింత మండలానికి చెందిన సాయి చంద్ కళాకారునిగా గుర్తింపు పొందాడు. తెలంగాణ ఉద్యమం, ప్రతి ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ గెలుపు కోసం తన వంతు కృషి చేశారు. గతంలో నాగర్ కర్నూల్ ఎంపీ స్థానానికి పోటీ చేయాలని ఆశించిన కొన్ని రాజకీయ సమీకరణాల వల్ల సాయి చందుకు అవకాశం లభించలేదు.

మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు గాను ఒక స్థానం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయగా, రెండవ స్థానం నుంచి టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాదం శివకుమార్‌కు అవకాశం కల్పిస్తారని శనివారం రాత్రి ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా ఆదివారం సీఎం కేసీఆర్ సాయి చంద్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్లు తెలిసింది. దీంతో ఈ నెల 23న పార్టీ అభ్యర్థులుగా ఎంపికైన కసిరెడ్డి నారాయణరెడ్డి, సాయి చంద్లు నామినేషన్ దాఖలు చేయనున్నారు.



Next Story

Most Viewed