2036 దాకా అధికారంలో ఉంచే చట్టంపై సంతకం

by  |
2036 దాకా అధికారంలో ఉంచే చట్టంపై సంతకం
X

మాస్కో: రష్య అధ్యక్షుడు వ్లాదిమిర పుతిన్ తనను 2036 దాకా పవర్ కొనసాగించడానికి దోహదపడే చట్టంపై సంతకం పెట్టారు. ఈ చట్టం పుతిన్‌ను మరో రెండు దఫాలు అంటే 12 ఏళ్లు అధికారంలో కొనసాగడానికి అవకాశం కల్పిస్తు్న్నది. రెండోసారి అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న పుతిన్ ప్రస్తుత టర్మ్ 2024తో ముగియనుంది. అనంతరం మరో 12 ఏళ్లు అధికారంలో కొనసాగుతారు. అంటే 68ఏళ్ల పుతిన్ తన వయసు 83ఏళ్లకు చేరే వరకు రష్య అధ్యక్షుడుగా కొనసాగనున్నారు. విదేశీ పౌరసత్వం కలిగిన వారెవ్వరూ రష్య అధ్యక్ష బాధ్యతలు తీసుకోలేరని ఈ చట్టం నిర్దేశిస్తున్నది. అలాగే, ఒక అధ్యక్షుడు రెండు దఫాలకు మించి పవర్‌లో కొనసాగలేడు. ఈ నిబంధనను పుతిన్‌కు అనుకూలంగా సవరించుకున్నారు. తన టర్మ్‌ను రీసెట్ చేసుకున్న పుతిన్ కొత్త చట్టంతో కొత్తగా బాధ్యతలు తీసుకుంటున్నట్టు గణించారు. ఈ సంస్కరణను రాజ్యాంగంపై తిరుగుబాటుగా విపక్షాలు అభివర్ణిస్తున్నాయి. ఈ చట్టసవరణను గతనెల దిగువ, ఎగువ పార్లమెంటు సభలు ఆమోదించాయి.


Next Story

Most Viewed