సింగిల్ డోస్ స్పుత్నిక్‌ టీకాకు రష్యా గ్రీన్ సిగ్నల్

by  |
Russia, Sputnik V
X

మాస్కో: రష్యా ప్రభుత్వం సింగిల్ డోస్ స్పుత్నిక్ లైట్ వర్షన్ టీకా వినియోగానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గమేలియా ఇన్‌స్టిట్యూట్ అభివృద్ధి చేసిన ఈ టీకా 79.4శాతం సామర్థ్యాన్ని కలిగి ఉన్నదని ఆర్‌డీఐఎఫ్ వెల్లడించింది. ఈ టీకా డోసుకు 10 అమెరికన్ డాలర్ల ధర ఉన్నట్టు తెలిపింది. రష్యాలో మాస్ వ్యాక్సినేషన్‌లో భాగంగా నిర్వహించిన ఈ ప్రయోగంలో టీకా సామర్థ్యాన్ని అంచనా వేశామని వివరించింది. టీకా వేసిన 28 రోజుల తర్వాత డేటా తీసుకుని గణించామని పేర్కొంది.

రష్యా, యూఏఈ, ఘనా, ఇతర దేశాల్లో 7000 మందిపై థర్డ్ ఫేజ్ ట్రయల్స్ సాగుతున్నాయని తెలిపింది. ఈ నెలలోనే మధ్యంతర ఫలితాలు వచ్చే అవకాశముందని వివరించింది. సింగిల్ డోస్ టీకాతో వేగంగా ఇమ్యునైజేషన్ సాధ్యమవుతుందని, ముఖ్యంగా కరోనా ఒక్కసారిగా విజృంభించిన దేశాల్లో ఈ టీకా పంపిణీ మంచి ఫలితాలనివ్వవచ్చునని పేర్కొంది. స్వల్ప సమయంలోనే ప్రజలను ఇమ్యునైజేషన్ చేయగలమని తెలిపింది. రెండు డోసుల స్పుత్నిక్ వీ 91.6శాతం సామర్థ్యం గలదని తెలిసిందే.


Next Story

Most Viewed