రూపాయి బలం తగ్గింది!

by  |
రూపాయి బలం తగ్గింది!
X

దిశ, వెబ్‌డెస్క్: ఒకవైపు విదేశీ పెట్టుబడులు వెనక్కి వెళ్ళిపోవడం.. మరోవైపు కరోనా మహమ్మారి తెచ్చే నష్టం దీర్ఘ కాలం కొనసాగుతుందన్న భయాలతో దేశీయంగా ఆర్థిక వ్యవస్థ అనిశ్చితి ఎదుర్కొంటోంది. పెట్టుబడిదారుల్లో రాను రాను సెంటిమెంట్ దెబ్బతింతోంది. అంతర్జాతీయంగా కూడా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పరిస్థితి కూడా ఇదే తరహాలో ప్రతికూలంగా కొనసాగుతుండటంతో మన కరెన్సీ విలువ స్వల్పంగా బలపడుతోంది. తాజాగా, అమెరికా డాలరు మారకంతో రూపాయి విలువ ఏకంగా 48 పైసల వరకూ క్షీణించింది. శుక్రవారం ఉదయం తర్వాత యూఎస్ డాలరుతో పోల్చితే రూపాయి మారకం విలువ రూ. 76.08 వద్ద ఉంది.

ఉదయం మాకెట్లు ప్రారంభమైన సమయంలో రూ. 75.97 వద్ద బలహీనంగా మొదలైన తర్వాత తర్వాత 48 పైసలు తగ్గింది. బ్యాంకుల వార్షిక ముగింపు కోసం ఏప్రిల్ 1, శ్రీరామనవమి కారణంగా ఏప్రిల్ 2 న ఇండియాలో ఫారెక్స్ మార్కెట్లు మూసివేయబడ్డాయి. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం…ఇండియాలో పెరుగుతున్న కరోనావైరస్ కేసులు, ప్రపంచవ్యాప్తంగా పరిస్థితుల ప్రభావం వీటిపై ఉంది. ఎందుకంటే పెట్టుబడిదారులు సురక్షితమైన అంచనాలతో డాలర్లను కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు కూడా ఒడిదుడుకులకు లోనవుతోంది. శుక్రవారం బ్రెంట్ క్రూడ్ ధర నిన్నటితో పోలిస్తే బ్యారెల్‌కు 3.5 శాతం వరకూ పెరిగి 28.92 డాలర్లకు చేరింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రష్యా, సౌదీ దేశాలు ధరల యుద్ధాన్ని ఆపాలంటూ ట్వీట్ చేయడంతో ఆయుల్ ఫ్యూచర్స్ 30 శాతంపైగా పెరిగింది.

Tags : Indian Rupee, Local Currency, | Domestic Currency, USDINR, Brent Crude

Next Story

Most Viewed