సంజయ్ చేస్తే రైట్.. రియా చేస్తే రాంగ్! ఎందుకలా?

97

దిశ, సినిమా : ‘చెహ్రె’ సినిమా నుంచి రియా చక్రవర్తిని తప్పించడం టాక్ ఆఫ్ ది బీటౌన్ అయిపోయింది. ఓ వైపు ఉన్న అవకాశాలే చేజారిపోతుండగా, ఇక కొత్తగా చాన్స్‌లు వచ్చే ప్రసక్తే లేదని అనుకున్నా.. తాజాగా ఓ ఫిల్మ్ మేకర్ తనతో వర్క్ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించాడు. డైరెక్టర్ రుమీ జాఫరీ.. రియాతో సినిమా చేసేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నట్లు తెలిపాడు. తను ప్రెట్టీ, టాలెంటెడ్ గర్ల్ అని, ప్రజలు తనను స్క్రీన్‌పై చూడాలనుకుంటున్నారని అభిప్రాయపడ్డాడు. ఆమె బెయిల్ మీద ఉన్నప్పటికీ తనతో వర్క్ చేసేందుకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. గతంలో బెయిల్ మీద ఉన్న సంజయ్ బిజీగా ఉన్నప్పుడు.. ఇప్పుడు రియా మాత్రం ఎందుకు వర్క్ చేయకూడదని ప్రశ్నిస్తున్నాడు. తనతో పాటు తన కుటుంబం కూడా చాలా కష్టాలు ఎదుర్కొందని, ఈ బాధ తనను మరింత మంచి నటిగా తీర్చిదిద్దుతుందని అభిప్రాయపడ్డాడు రుమీ.

సుశాంత్ సింగ్ సూసైడ్ కేసుతో పాటు డ్రగ్స్ కేసులో రియా అమాయకురాలు అన్న రుమీ.. సుశాంత్, రియాలతో కలిసి ఓ లవ్ స్టోరీ తీయాలనుకున్నానని, కానీ మనం ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచిందన్నారు. అదే స్టోరీలో మరో హీరోను సెలెక్ట్ చేసి సినిమా తీస్తానని లేదా కొత్తగా మరో ప్రాజెక్ట్‌లో రియాకు అవకాశమిస్తానని స్పష్టం చేశారు డైరెక్టర్.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..