ఆర్టీసీ కార్మికులకు జీతాలు చెల్లించాలి

94
RTC Workers Salaries

దిశ, తెలంగాణ బ్యూరో : ఆర్టీసీ కార్మికులకు యాజమాన్యం వెంటనే జీతాలు చెల్లించాలని టీఎస్ ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ కె.రాజిరెడ్డి, వైస్ చైర్మన్ కె.హన్మంత్ ముదిరాజ్ డిమాండ్ చేశారు. గురువారం వారు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఆర్టీసీ యాజమాన్యం వద్ద డబ్బులు ఉన్నప్పటికీ ఆగస్టు నెల జీతాలు 1వ తేదీన చెల్లించకపోవడం అన్యాయమన్నారు. 40 రోజుల క్రితం రూ.500కోట్లు అప్పు తెచ్చి బ్యాంకులో పెట్టుకొని సీసీఎస్‌కు ఉన్న బకాయిలు, విశ్రాంత ఉద్యోగులకు చెల్లించకపోవడం అన్యాయమన్నారు. అప్పు తెచ్చిన డబ్బులతో బకాయిలు తీర్చుకుని వడ్డీ భారాన్ని తగ్గించుకోకుండా బ్యాంకులో పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వెంటనే సీసీఎస్‌కు డబ్బులు చెల్లించడంతో పాటు విశ్రాంత ఉద్యోగులకు సెటిల్ మెంట్ చెల్లించాలని డిమాండ్ చేశారు.