ఒకటో తేదీనే జీతాలివ్వాలి : అశ్వత్థామరెడ్డి

by  |
Ashwathama Reddy
X

దిశ, తెలంగాణ బ్యూరో: వచ్చే నెల ఒకటో తేదీన జీతాలు ఇవ్వకుంటే ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యంపై క్రిమినల్ కేసు పెడతామని ఉద్యోగులు, నాయకులు హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం అన్ని డిపోల ఎదుట టీఎంయూ ఆధ్వర్యంలో బైఠాయించి నిరసనలు చేపట్టారు. ఇంకా వేతనాలు చెల్లించడం లేదని, దీంతో అనేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీఎంయూ ప్రధాన కార్యదర్శి అశ్వత్థామరెడ్డి, నాయకులు మీడియాతో మాట్లాడారు. వేతనాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్​చేశారు. గతంలో తొలి వారంలోనే వేతనాలు వచ్చేవని, కానీ ప్రస్తుతం మూడు వారాలు కావస్తున్నా ఇవ్వడం లేదని తెలిపారు. ప్రజా రవాణా పెరిగి, ఆదాయం పెరిగినా జీతాలు సరిగా చెల్లించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగైదు నెలలుగా ప్రతినెలా 15వ తేదీ వరకు వేతనాలు ఇవ్వడం లేదని విమర్శించారు. ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను ఉద్యోగులుగా గుర్తిస్తామని ప్రకటించి మర్చిపోయిందన్నారు. సీఎం కేసీఆర్​ఆర్టీసీ కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీని నాశనం చేసేందుకు ప్లాన్​వేస్తున్నారని, అందుకే కార్మిక సంఘాలను నిర్వీర్యం చేశారని ఆరోపించారు. ఆర్టీసీ కార్మికులకు పక్షాన టీఎంయూ ఉంటుందని, కార్మికుల కోసం పోరాడుతుందని తెలిపారు.



Next Story

Most Viewed