ఆరు జిల్లాల్లో కొత్తగా ఎయిర్‌పోర్టులు

by  |
ఆరు జిల్లాల్లో కొత్తగా ఎయిర్‌పోర్టులు
X

దిశ, తెలంగాణ బ్యూరో : మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ కోసం 2021-22 బడ్జెట్‌లో తెలంగాణ ప్రభుత్వం రూ.15,030 కోట్లు కేటాయించింది. గతేడాది ప్రకటించిన బడ్జెట్‌లో రూ.14,809 కోట్లను కేటాయించిన ప్రభుత్వం.. ఈ ఏడాది స్వల్పంగా రూ.221 కోట్లను పెంచుతూ రూ.15,030 కోట్లను కేటాయించింది.

ఎయిర్ స్ట్రిప్‌ల అభివృద్దికి రూ.100 కోట్లు

అటు రాష్ట్ర ప్రజలు విమానయాన సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నట్టు హరీష్ రావు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో శంషాబాద్ ఎయిర్ పోర్టు ఒక్కటి మాత్రమే విమాన సర్వీసులకు కేంద్రంగా మారింది. రాష్ట్రంలో విమానయానం చేసే ప్రజలంతా హైదరాబాద్‌కు రాకుండా ఉండేందుకు వివిధ నగరాలలో విమానయాన స్ట్రిప్ లను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ముఖ్యంగా వరంగల్, కొత్తగూడెం, పెద్దపల్లి, ఆదిలాబాద్, నిజామాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో విమానాలు ల్యాండ్ అయ్యేందుకు ఎయిర్ పోర్టులు నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్లను కేటాయించినట్టు మంత్రి హరీష్ రావు బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు.

దేవాలయాల అభివృద్ధికి రూ.720 కోట్లు

ఇక తెలంగాణలో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు ఎన్నో ఉన్నా సమైక్య రాష్ట్రంలో అభివృద్ధికి నోచుకోలేదని, తగిన గుర్తింపు, వైభవం రాలేదని మంత్రి హరీష్ అన్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ యాదాద్రి క్షేత్రాన్ని భూలోక వైకుంఠంగా తీర్చిదిద్దుతున్నారన్నారు. ఇలా రాష్ట్రంలో ఉన్న అన్ని ఆలయాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జంట నగరాల్లోని దేవాలయాల్లో కూడా ఈ యేడాది నుంచి దూప దీప నైవేద్యం(డీడీఎన్) స్కీంని అమలు చేసే విధంగా ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన పేర్కొన్నారు. 2021-22 బడ్జెట్ లో దేవాలయాల అభివృద్ధి, దూప దీప నైవేద్యం, ఉద్యోగుల సంక్షేమం కోసం రూ.720 కోట్లు కేటాయించినట్లు ఆర్థిక మంత్రి హరీష్ రావు ప్రకటించారు. గతేడాది ఆలయాల అభివృద్ధికి రూ.550 కోట్లను ప్రభుత్వం కేటాయించింది.

Next Story

Most Viewed