రైతులకు శుభవార్త.. ఆ నెలలో ఎకరానికి రూ. 7500 జమ

by Mahesh |
రైతులకు శుభవార్త.. ఆ నెలలో ఎకరానికి రూ. 7500 జమ
X

దిశ, వెబ్ డెస్క్: అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తాము గెలవడానికి ప్రధాన హామీల్లో ఒకటైన రైతు భరోసా అమలుకు సన్నాహాలు చేస్తుంది. ఈ క్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గత వారం ఆ శాఖ అధికారులతో సమీక్షించారు. అలాగే వానాకాలంలో సాగయ్యే పంటల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రభుత్వం రైతు భరోసా కింద ఇస్తానన్న పెట్టుబడి సాయాన్ని ఈ వానాకాలం సీజన్ నుంచే రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో పంటలు సాగు ప్రారంభం అయ్యే జులై నెలలో ఎకరానికి రూ. 7500 చొప్పున పెట్టుబడి సాయం కింద రైతులకు అందిస్తామని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. అలాగే రైతుల నుండి అఫిడవిట్ తీసుకుంటేనే కౌలుదార్లకు భరోసా సహాయం అందుతుందని పేర్కొన్నారు. ఆగస్టు 15 లోపు రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని మరోసారి స్పష్టం చేశారు. తాము అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజల కోసం ఇచ్చిన ప్రతి హామీకి కట్టుబడి ఉన్నామని.. వాటన్నింటిని అమలు చేస్తామని మంత్రి తుమ్మల హామీ ఇచ్చారు.

Next Story

Most Viewed