వైస్‌ కెప్టెన్‌గా రోహిత్.. ఉమేశ్ స్థానంలో న‌ట‌రాజ‌న్

by  |
వైస్‌ కెప్టెన్‌గా రోహిత్.. ఉమేశ్ స్థానంలో న‌ట‌రాజ‌న్
X

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా భారత జట్టును గాయాలు వెంటాడుతున్నాయి. అయినా పట్టుకోల్పోకుండా బాక్సింగ్ డే టెస్టు విజయంతో ఊపుమీద ఉన్న టీమిండియా మూడో టెస్టులో విజయం సాధించాలని చూస్తోంది. ఈ క్రమంలోనే గాయం కారణంగా సిరీస్ నుంచి దూరమైన ఉమేష్ యాదవ్ స్థానంలో యార్కర్ కింగ్ నటరాజన్‌ను జట్టులోకి తీసుకుంది టీమిండియా. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలు, టీ20ల్లో అదరగొట్టిన నటరాజన్.. టెస్టుల్లో కూడా దుమ్ములేపుతాడని జట్టు యాజమాన్యం అనుకుంటోంది.

అంతేగాకుండా ఇప్పటికే టీమిండియాలో చేసిన హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ తుదిజట్టులో వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఈ మేరకు బీసీసీఐ ప్రకటన విడుదల చేసింది. అత్యంత నిలకడ, కచ్చితత్వంతో యార్కర్లు సంధించగల నటరాజన్, టీమిండియా బ్యాటింగ్ బలం రోహిత్ శర్మ క్వారంటైన్ ముగించుకొని జట్టులో చేరడంతో మరింత ఉత్సాహంతో మూడో టెస్టులో రాణించాలని చూస్తోంది.

Next Story

Most Viewed