ఫిర్యాదులపై వెంటనే స్పందించండి : సీఎస్

by  |
ఫిర్యాదులపై వెంటనే స్పందించండి : సీఎస్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ధరణి పోర్టల్​లో వచ్చిన ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్​కుమార్​ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ధరణి పోర్టల్ పై బీఆర్కే భవన్ లో అధికారులతో సమీక్షించారు. జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకుంటూ ఫిర్యాదులను వీలైనంత త్వరగా పరిష్కరించాలని సూచించారు. ప్రతిరోజూ పెండెన్సీ స్థితిని పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు.

వాట్సాప్, ఈ-మెయిల్ లతో పాటు అందిన అన్ని ఫిర్యాదులపై స్పందించి, వెంటనే పరిష్కరించాలన్నారు. భూ విషయాలకు సంబంధించిన మాడ్యూల్స్, ధరణి పోర్టల్‌, ఇతర అంశాలను ప్రధాన కార్యదర్శి సమీక్షించారు. సమావేశంలో స్టాంపులు, రిజిష్ట్రేషన్ల శాఖ ఐజీ శేషాద్రి, ఆర్ధిక శాఖ స్పెషల్ సెక్రటరీ రోనాల్డ్ రోస్, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, టీఎస్​టీఎస్​ఎండీ జి.టి వెంకటేశ్వర్ రావు, సీసీఎల్ఏ ప్రత్యేక అధికారి సత్య శారద తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed