ఉత్పత్తి ఆపేస్తామన్న రెనాల్ట్ కార్ల సంస్థ!

by  |
ఉత్పత్తి ఆపేస్తామన్న రెనాల్ట్ కార్ల సంస్థ!
X

కరోనా దెబ్బకు అనేక ఉత్పత్తుల కేంద్రమైన చైనాలోని కంపెనీలు వెనక్కి వెళ్తాయని ఎప్పటినుంచో వినిపిస్తున్నదే. ఇటీవల కొన్ని కంపెనీలు చైనాలో తమ కార్యకలాపాలు ఆపేస్తున్నట్టు ప్రకటించారు కూడా. తాజాగా ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ రెనాల్ట్ కూడా చైనాలో తమ ఉత్పత్తిని పూర్తీగా ఆపేస్తున్నట్టు ప్రకటించింది. ఎలక్ట్రిక్, వాణిజ్య వాహనాలపై దృష్టి పెట్టేందుకు చైనాలోని వ్యాపారాన్ని మూసేస్తున్నట్టు ప్రముఖ కార్ల తయారీ సంస్థ రెనాల్ట్ వెల్లడించింది.. గత ఏడేళ్లుగా చైనాలోని డెంగ్‌ఫెండ్ మోటార్ కార్ప్‌తో రెనాల్ట్ సంస్థ భాగస్వామ్యం కలిగి ఉంది. కార్లు కరోనా వైరస్ వల్ల రెనాల్ట్ వాహనాల అమ్మకాలు దారుణంగా పడిపోయాయి. దీంతో చైనాలో ప్రధాన వ్యాపారాన్ని మూసేసి ఎలక్ట్రిక్, వాణిజ్య వాహానలపై మాత్రమే దృష్టి సారించనున్నట్టు ప్రకటించింది. 2017 నుంచి వాహన పరిశ్రమలకు అతిపెద్ద మార్కెట్ అయినా చైనాలో రెనాల్ట్ అమ్మకాలు పోటీని తట్టుకోలేకపోతున్నాయి. 2019 ఆర్థిక సంవత్సరంలోని తొలి త్రైమాసికంలో రెనాల్ట్ అమ్మకాలు 45 శాతానికి పైగా దిగజారాయి. రెనాల్ట్ ఉత్పత్తి కరోనా పుట్టిన వూహాన్ నగరంలోనే ఉండటం విశేషం. ఈ ఏడాది కొవిడ్-19 వల్ల షట్‌డౌన్ ప్రకటించడంతో డీలర్‌షిప్‌లన్నీ మూతపడ్డాయి.

చైనా మార్కెట్లో ఇప్పుడిప్పుడే డిమాండ్ పెరుగుతున్న ఎలక్ట్రిక్, వాణిజ్య వాహనాల ఉత్పత్తిపై దృష్టి సారిస్తామని, భవిష్యత్తులో ఈ విభాగంలో తమ సత్తా చూపిస్తామని రెనాల్ట్ వెల్లడించింది. నిస్సాన్ మోటార్స్, ఈజీటీ ఎనర్జీ కంపెనీల భాగస్వామ్యంతో ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేస్తామని రెనాల్ట్ సంస్థ పేర్కొంది.

Tags: Renault, renault cars, business, coronavirus, covid-19



Next Story

Most Viewed