రిలయన్స్ జియో మరో 'సిల్వర్' డీల్!

by  |
రిలయన్స్ జియో మరో సిల్వర్ డీల్!
X

దిశ, వెబ్‌డెస్క్: ఇప్పుడంతా రిలయన్స్ వారి జియో హవానే నడుస్తోంది. కరోనా సమయంలో కీలక వాటా అమ్మకాలతో జియోను మరింత పటిష్టంగా మారుస్తున్నారు రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ. ఇటీవల సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌తో ఒప్పందంతో ఫుల్ జోష్ నింపుకున్న జియో..తాజాగా అమెరికన్ ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజ సంస్థ సిల్వర్‌లేక్ పార్ట్‌నర్స్‌కు జియోలో 1.15 శాతం వాటాను ఇచ్చింది. ఈ వాటా విలువ 750 మిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో రూ. 5,655 కోట్లు. ఫేస్‌బుక్ కొనుగోలు చేసిన వాటా 9.99 శాతం కాగా దీని విలువ 5.7 బిలియన్ డాలర్లు. మన కరెన్సీలో సుమారు రూ. 43 వేల కోట్లకు పైమాటె. సిల్వర్‌లేక్ పార్ట్‌నర్స్‌తో ఒప్పందం మెగా డీల్‌గా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ అంశంపై రెండు సంస్థలు ఆనందాన్ని వ్యక్తం చేశాయి. అయితే, ఈ ఒప్పందానికి సంబంధించి మార్కెట్ రెగ్యులేటరీ, ఇతర సంబంధిత చట్టం అనుమతులను పొందాలి ఉంది.

డిజిటల్ ఇండియా లక్ష్యం…

ఈ ఒప్పందం గురించి స్పందించిన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేశ్ అంబానీ…ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ కంపెనీగా పేరున్న సిల్వర్‌లేక్‌తో భాగస్వామ్యం సంతోషంగా ఉందని, గ్లోబల్ టెక్నాలజీ కంపెనీలతో ఒప్పందం ద్వారా డిజిటల్ ఇండియా సాధనలో కీలకమైన పరిణామమని తెలిపారు. అలాగే, సిల్వర్‌లేక్ కో సీఈవో ఎగాన్ డర్బన్ స్పందిస్తూ..అత్యంత బలమైన సంస్థల్లో ఒకటైన జియో అని ప్రస్తావిస్తూ..వ్యవస్థాపక నిర్వహణ బృందం నేతృత్వంలో నడిచే కంపెనీతో భాగస్వామ్యం ఆనందంగా ఉందని చెప్పారు.

ఇన్వెస్టర్లలో ఆసక్తి..

ఇటీవల వార్షిక, త్రైమాసిక ఫలితాలు వెల్లడించిన సందర్భంలో ఫేస్‌బుక్‌తో పెట్టుబడి ద్వారా..రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు ఇతర వ్యూహాత్మకమైన, ఆర్థిక పెట్టుబడిదారుల నుంచి భారీ ఆసక్తి నెలకొందని, రానున్న మరికొద్ది నెలల్లో ఇదే తరహా పెట్టుబడులను సాధిస్తామని రిలయన్స్ సంస్థ వెల్లడించింది.

సిల్వర్‌లేక్ సంస్థ గురించి…

1999లో ప్రారంభైన టెక్నాలజీ సిల్వర్‌లేక్ కంపెనీ పెట్టుబడులపై దృష్టి సారిస్తూ ప్రత్యేక సంస్థగా ఎదుగుతూ.. వ్యూహాత్మక క్రమశిక్షణను కొనసాగించింది. 2013లో ప్రముఖ కంప్యూటర్ దిగ్గజం డెల్ సంస్థను సొంతం చేసుకున్న తర్వాత సిల్వర్ లేక్ ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ సంస్థ టెక్నాలజీ పెట్టుబడిలో ఉత్తమ నిర్వహణ, నిబద్ధత కలిగిన మూలధనంలో 43 బిలియన్ డాలర్లకు పైగా ఆస్తులు కలిగి ఉంది. అలాగే, ప్రపంచవ్యాప్తంగా సిలికాన్ వ్యాలీ, న్యూయార్క్, హాంకాంగ్, లండన్ వంటి ప్రాంతాల్లోని సుమారు 100 సంస్థల్లో పెట్టుబడులు, ఆపరేటింగ్ నిపుణుల బృందం కలిగి ఉంది.

సిల్వర్‌లేక్ సంస్థ మూడు పెట్టుబడి వ్యూహాలను కలిగి ఉంటుంది:

సిల్వర్ లేక్ పార్ట్‌నర్స్ (ఎస్‌ఎల్‌పీ) టెక్నాలజీ, టెక్నాలజీ-ఎనేబుల్డ్, సంబంధిత వృద్ధి వ్యాపారాలలో పెద్ద ఎత్తున పెట్టుబడుల ద్వారా వ్యూహాత్మకంగా ఉంటుంది.

సిల్వర్ లేక్ ఆల్పైన్ (ఎస్ఎల్ఏ) లార్జ్-క్యాప్ టెక్నాలజీ, టెక్నాలజీ-ఎనేబుల్డ్, సంబంధిత వృద్ధి వ్యాపారాలలో నిర్మాణాత్మక ఈక్విటీ, రుణాల పెట్టుబడి అవకాశాలను లక్ష్యంగా ఉంటుంది.

సిల్వర్ లేక్ వాటర్‌మన్ (ఎస్‌ఎల్‌డబ్ల్యూ) టెక్నాలజీ, టెక్నాలజీ-ఎనేబుల్డ్, సంబంధిత వృద్ధి పరిశ్రమలలో ద్వితీయస్థాయి ప్రైవేట్ సంస్థలకు అనువైన వృద్ధికి మూలధనాన్ని అందిస్తుంది.

తెలుసుకోవలసిన విషయాలు:

* సిల్వర్ లేక్ 2013లోనే ఇండియాలో పెట్టుబడులు పెట్టింది. బెంగుళూరులోని ఏక్తా సాఫ్ట్‌వేర్‌లో మైనారిటీ వాటాను కొనుగోలు చేసింది. ఏక్తా సాఫ్ట్‌వేర్ సంస్థ కమొడిటీ ట్రేడింగ్ కోసం సాఫ్ట్‌వేర్‌ను తయారుచేస్తుంది.

* ఈ సంస్థ పోర్ట్‌ఫోలియో పెట్టుబడుల ద్వారా సంవత్సర ఆదాయం 204 బిలియన్ల కంటే ఎక్కువే ఉంటుంది.

* సిల్వర్ లేక్ పోర్ట్‌ఫోలియోలో ట్విట్టర్, ఎయిర్‌ బీఎన్‌బీ, అలీబాబా గ్రూప్, యాంట్ ఫైనాన్షియల్, దీదీ చక్సింగ్, మోటరోలా సొల్యూషన్స్, సిటీ ఫుట్‌బాల్ గ్రూప్‌లలో పెట్టుబడులున్నాయి.

* ఇది 2011లో స్కైప్‌ను మైక్రోసాఫ్ట్‌కు 8.5 బిలియన్లకు విక్రయించింది. ఇది చరిత్రలో అత్యంత విజయవంతమైన ప్రైవేట్ ఈక్విటీ విక్రయంగా పేర్కొంటారు.

Tags : Facebook, Jio Platforms, Reliance Jio, Reliance Jio Silver Lake, Silver Lake, Stake Buy in silver lake

Next Story