ఎస్సారెస్పీ నుంచి నీరు విడుదల.. చేసింది వీళ్లే

by  |
ఎస్సారెస్పీ నుంచి నీరు విడుదల.. చేసింది వీళ్లే
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: వానకాలం పంటల కోసం శ్రీరాం సాగర్ ప్రాజేక్ట్ నుంచి సోమవారం నీటిని విడుధల చేశారు. శ్రీరామ్ సాగర్ ప్రాజేక్ట్ క్రింద సాగవుతున్న పంటలకు కాకతీయ, లక్ష్మి కాలువల ద్వార నీటి విడుధలను రాష్ర్ట రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చేస్తారని గత వారం అధికారులు ప్రకటించిన విషయం తెలిసిందే. మంత్రి లేకుండానే సోమవారం ప్రాజేక్ట్ సిఇ శంకర్, జేన్ కో డైరెక్టర్ వేంకటరాజం లు కాకతీయ కాలువకు 4000 క్యూసెక్ లు, లక్మి కాలువకు 100 క్యూసెక్ ల నీటిని విడుథల చేశారు.ప్రస్తుతం ప్రాజేక్ట్ లో1073.50 అడుగుల 36.316 టియంసీల సామర్థ్యం గల నీటి నీల్వ ఉందని పేర్కోన్నారు. ప్రాజేక్ట్ కు ఎగువ నుంచి ప్రస్తుతం 16,395 క్యూసేక్కుల నీటి వరధ వస్తుందన్నారు. ఈ సీజన్ లో 11,433 క్యూసెక్ నీరు చోప్పున ప్రాజేక్టులోకి వచ్చాయి. ఇప్పుడు వస్తున్న ఇన్ ప్లోలో అత్యధికంగా ప్రాజేక్టులోకి వరథ నీరు రావడం రెండోసారి. కాకతీయ , లక్ష్మి కాలువలతో పాటు ఎత్తిపోతల పథకాల క్రింద 67 చెరువులలో నీటిని నింపనున్నారు. ప్రస్తుత పరిస్థితిలో ప్రతిరోజు ఆలీసాగర్ లీప్ట్ కు720 క్యూసేక్ లు, గుత్ప లిప్ట్ ద్వార 270 క్యూసేక్ ల నీటిని విడుధల చేస్తున్నారు.

Next Story