శ్రీవారి దర్శన టికెట్ల కోసం ఎగబడ్డ భక్తులు.. సర్వర్ మొరాయించడంతో 

by  |
ttd online tickets
X

దిశ, ఏపీ బ్యూరో: ఆగస్ట్ నెలకు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం స్వామివారి దర్శన టికెట్లను విడుదల చేసింది. మంగళవారం ఉదయం 9 గంటలకు రూ. 300 విలువ చేసే టికెట్లను ఆన్ లైన్‌లో ఉంచింది. కరోనా నేపథ్యంలో రోజుకు 5 వేల టికెట్లను మాత్రమే అధికారులు అందుబాటులో ఉంచినట్లు టీటీడీ తెలిపింది. అయితే టికెట్లు ఆన్‌లైన్‌లో ఉంచడంతో భక్తులు ఒక్కసారిగా అధిక సంఖ్యలో టికెట్ల కోసం ప్రయత్నించారు. దాంతో టీటీడీ వెబ్‌సైట్ సర్వర్ డౌన్ అయింది. కాసేపు సర్వర్ మొరాయించింది. వెబ్ సైట్లో టికెట్లు కనిపించలేదు. దీంతో భక్తులు ఒక్కసారిగా గందరగోళానికి గురయ్యారు. ఆ తర్వాత కాసేపటికి టికెట్లు కనిపించడంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. ఆగస్ట్ నెల అకామిడేషన్‌కు సంబంధించిన స్లాట్ బుకింగ్స్ మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభంకానున్నట్లు టీటీడీ తెలిపింది. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలను పాటించాలని కోరింది.

Next Story

Most Viewed