సీక్రెట్ లవ్ మ్యారేజ్.. నడిరోడ్డుపై ప్రేమికుడిని చితకబాదారు

by  |
సీక్రెట్ లవ్ మ్యారేజ్.. నడిరోడ్డుపై ప్రేమికుడిని చితకబాదారు
X

దిశ, అసిఫాబాద్ : ప్రేమ వ్యవహారం యువకుడి ప్రాణాల మీదకు తెచ్చింది. తమ ఇంటి అమ్మాయిని ప్రేమించాడనే కారణంతో బంధువులు అతన్ని చితకబాదారు. ఈ ఘటన కొమురంభీం అసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలంలో మంగళవారం ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. తిర్యానీ మండల కేంద్రానికి చెందిన షేర్ల రాము అనే యువకుడు ఇర్కపెళ్లి గ్రామానికి చెందిన సమత గత రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఆరు నెలల కిందట ఇరువురు ఇంట్లో చెప్పకుండా హైదరాబాదులో రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఇంటికి వచ్చిన ప్రేమికులు తల్లిదండ్రులకు పెళ్లి విషయం చెప్పకుండా ఎవరి ఇళ్లలో వారు ఉంటున్నారు.

తాజాగా పెళ్లి విషయం అమ్మాయి ఇంట్లో తెలియడంతో వారి బంధువులు అబ్బాయి ఇంటికి వచ్చారు. అనంతరం అతన్ని బయటకు తీసుకువచ్చి నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే అమ్మాయి కుటుంబసభ్యులు మూకుమ్మడిగా దాడి చేశారు. ఈ ఘటనలో అబ్బాయి తలకు తీవ్ర గాయమైంది. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని అమ్మాయి తరఫు వారిని అదుపులోకి తీసుకున్నారు. యువకుడిని వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అమ్మాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Next Story

Most Viewed