ప్రపంచంలోనే తొలి సిమెంట్ ఆధారిత బ్యాటరీలు

by  |
ప్రపంచంలోనే తొలి సిమెంట్ ఆధారిత బ్యాటరీలు
X

దిశ, ఫీచర్స్ : ప్రపంచంలోనే తొలి సిమెంట్ ఆధారిత బ్యాటరీలు అందుబాటులోకి రానున్నాయి. స్వీడన్‌కు చెందిన చామర్స్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ సిమెంట్‌తో తయారు చేసిన బ్యాటరీలను అభివృద్ధి చేసింది. ఈ బ్యాటరీలను సౌర సెల్ ప్యానెల్స్‌తో కలిపి రహదారులు లేదా వంతెనలలోని పర్యవేక్షణ వ్యవస్థలకు విద్యుత్తును అందించే శక్తి వనరుగా ఉపయోగించవచ్చు. అంతేకాదు ఆర్కిటెక్చర్ సివిల్ ఇంజనీరింగ్ విభాగం శాస్త్రవేత్తలచే అభివృద్ధి చేయబడిన ఈ సిమెంట్ ఆధారిత బ్యాటరీలు బహుళ అంతస్తుల భవనాలకు విద్యుత్‌ను నిల్వ చేసే శక్తి సామార్థ్యాలను కలిగి ఉన్నాయి.

పునర్వినియోగించే సిమెంట్ ఆధారిత బ్యాటరీని తయారు చేయడం ప్రపంచంలో ఇదే మొదటిసారి కాగా.. వీటి తయారీకి షార్ట్ కార్బన్ ఫైబర్స్‌తో కలిపిన సిమెంట్ ఆధారిత మిశ్రమాన్ని ఉపయోగించారు. కాగా ఈ మిశ్రమం విద్యుత్ వాహకత, టఫ్‌నెస్ పెంచేందుకు సహాయపడనుంది. లోహపు పూతతో కూడిన కార్బన్ ఫైబర్ మెష్‌కు యానోడ్‌గా ఇనుము, కాథోడ్‌గా నికెల్ మిశ్రమాన్ని పొందుపరచగా.. ఈ బ్యాటరీలు చాలా సౌకర్యవంతంగా, దృఢమైనదిగా ఉండనుందని నివేదికలు వెల్లడించాయి.

‘మేము అభివృద్ధి చేసిన ఈ ప్రత్యేక బ్యాటరీని పునర్వినియోగించుకోవచ్చు. ఇంతకు ముందెన్నడూ ఇలాంటి టెక్నాలజీ కలిగిన బ్యాటరీలు తయారు చేయబడలేదు. ఇది నమ్మకమైందని కాన్సెప్ట్-ఎట్-ల్యాబ్ స్కేల్ రుజువు చేసింది’ అని మెర్కామ్ ఇండియా విశ్వవిద్యాలయ మాజీ సహచరుడు ఎమ్మా జాంగ్ వెల్లడించాడు. బ్యాటరీలో సగటున చదరపు మీటరుకు 7 Wh (లేదా లీటరుకు 0.8 Wh)తో శక్తి సాంద్రత ఉత్పత్తి అవుతుందని, కానీ వాణిజ్య బ్యాటరీలతో పోలిస్తే తక్కువ సాంద్రత కలిగి ఉంటుందని తెలిపాడు.



Next Story

Most Viewed