నోటి దూలతో ఆక్స్ ఫర్డ్ పదవికి ఎసరు!

202

దిశ,వెబ్‌డెస్క్: నోరున్నది కదా అని ఏది పడితే అది మాట్లాడితే కుదరదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆచితూచి పదాలు ఎంచుకోవాలి. కొలిచి కొలిచి.. కొసరి కొసరి మాట్లాడాలి. ఎందుకంటే ఇది టెక్ యుగం. సోషల్ మీడియా శకం. మాట జారారో అంతే సంగతులు.

చరిత్రలో తొలిసారి ఇండియాకు చెందిన విద్యార్ధిని రష్మి సామంత్ ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ విద్యార్ధి విభాగానికి నాయకురాలిగా నియమితులయ్యారు. నాయకురాలిగా బాధత్యలు చేపట్టిన కొద్దిరోజులకే ఆ పదవి నుంచి తప్పుకున్నట్లు లేఖ రాశారు. అందుకు కారణం ఆమె నోటిదూలే.

2017లో రష్మి జర్మనీ బెర్లిన్ కు చెందిన హోలోకాస్ట్ మెమోరియల్ యూనివర్సినీ సందర్శించారు. ఈ సందర్భంగా తాను మలేషియాలో ఉన్నప్పుడు చైనా లాంగ్వేంజ్ లో తాను చదివిన జాత్యహంకార వ్యాఖ్యలు ఇలా ఉన్నాయంటూ.., ఓ ఫోటోకి తాను చదివిన వ్యాఖ్యల్ని యాడ్ చేసి పోస్ట్ చేసింది. అంతే రష్మి చేసిన ఆ పోస్ట్ పై చైనా విద్యార్ధులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇటీవల 2020-2021 ఏడాదికి గాను ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలో విద్యార్ధి విభాగానికి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో లినారె కాలేజ్‌లో ఎమ్మెస్సీ చదువుతున్న రష్మి మొత్తం 3,708 ఓట్లకుగానూ, 1,966 ఓట్లు సాధించారు. అయితే 2017లో చైనా విద్యార్ధులను ఉద్దేశించి జాత్యహంకార వ్యాఖ్యలు చేసిన కారణంగా రష్మి తన పదవికి రాజీనామా చేయాలని విద్యార్ధులు డిమాండ్ చేశారు. అంతేకాదు అందుకు సంబంధించిన ఫోటోలతో ప్రచారం చేశారు. దీంతో చేసేది లేక తన పదవికి రష్మీ రాజీనామా చేశారు.

వారం రోజుల క్రితం ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ విద్యార్ధి విభాగానికి చెందిన వార్తాపత్రిక ‘చెర్వెల్’ లో రష్మి తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు బహిరంగంగా ప్రకటించింది. ‘ ఇటీవల తలెత్తిన పరిణామాలకు నేను క్షమాపణలు చెబుతున్నాను. మీరు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోవడం చాలా బాధగా ఉంది. నా చర్యలు లేదా మాటలతో బాధపడుతున్న ప్రతి విద్యార్థికి నేను హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాను. నాపై మీ నమ్మకాన్ని మళ్ళీ పొందే అవకాశాన్ని కోరుతున్నాను అని’ విద్యార్ధిని రష్మి సామంత్ తెలిపారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..