సెక్స్ ఎడ్యుకేషన్ నార్మలైజ్ చేయాల్సిన అవసరముంది : రష్మి

by  |
Rashmi Gautham
X

దిశ, సినిమా: యూట్యూబర్ భార్గవ్ 14 ఏళ్ల పాపను గర్భవతిని చేసిన విషయంలో వస్తున్న కామెంట్స్‌పై సింగర్ చిన్మయి శ్రీపాద మండిపడింది. ఈ ఘటనపై ఇన్‌స్టా్గ్రామ్‌లో బాధితురాలినే నిందించిన నెటిజన్ వ్యాఖ్యల పట్ల స్పందించిన చిన్మయి.. ఓ చదువుకున్న మహిళ ఇలాంటి ప్రశ్నలు అడగడం షేమ్‌ఫుల్ అని ఫైర్ అయింది. నాలుగు నెలల ప్రెగ్నెన్సీ అయ్యేవరకు మైనర్ గర్ల్ బయటకు ఎందుకు చెప్పలేదు? భార్గవ్ మిస్‌బిహేవ్ చేసినప్పుడే రిపోర్ట్ ఎందుకు చేయలేదు? అని అడగడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎంతమంది తల్లిదండ్రులు ఇండియాలో ప్రెగ్నెన్సీ, సెక్స్ గురించి పిల్లలతో మాట్లాడుతున్నారు? తెలుగు సొసైటీలో ఎంతమంది పేరెంట్స్ టీనేజర్స్‌ను సెక్స్ ఎడ్యుకేషన్ కోసం డాక్టర్/కౌన్సిలర్ దగ్గరకు తీసుకెళ్తున్నారు? అని ప్రశ్నించింది. ఇంతకీ ఈ ప్రశ్న అడిగిన మ్యారీడ్ ఉమన్.. ఎప్పుడైనా తమ తల్లిదండ్రులతో సెక్స్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడిందా? అంటే దీనిపై ఇంకా సమాధానం ఇవ్వలేదని చెప్పింది చిన్మయి. కాగా ఈ పోస్ట్‌ను రీపోస్ట్ చేసిన యాంకర్ రష్మి గౌతమ్.. చిన్మయిని ప్రశంసించింది. సెక్స్ ఎడ్యుకేషన్, పీరియడ్స్, కండోమ్స్, బర్త్ కంట్రోల్ పిల్స్‌పై చర్చను నార్మలైజ్ చేయాల్సిన అవసరముందని అభిప్రాయపడింది.



Next Story