మోడీ వాటిపై కూడా చర్చించాలి : రాహుల్ గాంధీ

42
Rahul Gandhi

న్యూఢిల్లీ : విద్యార్థులతో ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమం నిర్వహించిన ప్రధాని మోడీ.. దేశంలో నానాటికీ పెరుగుతున్న ఖర్చులపైనా చర్చ చేయాలని కాంగ్రెస్ మాజీ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. దేశంలోని ఎంపిక చేసిన విద్యార్థులు, తల్లిదండ్రులతో మోడీ బుధవారం పరీక్షా పే చర్చ కార్యక్రమం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ స్పందిస్తూ.. ‘దేశంలో ఒక వ్యక్తి తన వాహనంలో ఆయిల్ నింపుకోవడం కూడా ఒక పరీక్షగానే మారింది. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలపై కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న పన్నులు.. నానాటికీ పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు సామాన్యులకు కఠిన పరీక్ష పెడుతున్నాయి. మోడీజీ.. ఖర్చా పే బీ చర్చ (ఖర్చుల మీద కూడా చర్చ) చేపట్టండి..’ అని రాహుల్ గాంధీ తెలిపారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..