ఏపీ శాసన మండలి రద్దుకు సహకరించండి.. కేంద్ర మంత్రులకు ఎంపీ రఘురామ లేఖలు

by  |
ragurama krishnamraju news
X

దిశ, ఏపీ బ్యూరో: ఏపీలో శాసన మండలిని రద్దు చేయలంటూ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు కేంద్రమంత్రులకు రాసిన లేఖలు ప్రకంపనలకు రేపుతున్నాయి. శాసనమండలి రద్దు తీర్మానాన్ని వచ్చే పార్లమెంట్‌ సమావేశాల్లో ఆమోదించాలని విజ్ఞప్తి చేస్తూ కేంద్ర న్యాయ శాఖామంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌, పార్లమెంటరీ వ్యవహారాల శాఖమంత్రి ప్రహ్లాద్‌ జోషీలకు లేఖలు రాశారు. గత ఏడాది జనవరి 27న మండలిని రద్దు చేస్తూ ఏపీ అసెంబ్లీ తీర్మానం చేసిందని లేఖలో పేర్కొన్నారు.

మండలి నిర్వహణ అనవసర ఆర్ధిక భారం తప్ప ప్రయోజనం లేదన్న తమ ముఖ్యమంత్రి జగన్‌ అభిప్రాయన్ని ఆమోదించాలని కోరారు. జూలై 19న ప్రారంభమయ్యే పార్లమెంట్‌ వర్షకాల సమావేశాల్లో ఏపీ మండలి రద్దు తీర్మాన్ని ఆమోదించాల్సిందిగా కేంద్రమంత్రులను కోరారు. వైసీపీ పార్లమెంట్‌ సభ్యుడిగా తాను ఈ లేఖను రాస్తున్నట్లు ఎంపీ రఘురామకృష్ణంరాజు లేఖలో స్పష్టం చేశారు.



Next Story

Most Viewed