హర్భజన్ రికార్డును బద్దలు కొట్టిన అశ్విన్

by  |
హర్భజన్ రికార్డును బద్దలు కొట్టిన అశ్విన్
X

దిశ, స్పోర్ట్స్ : చెన్నై లోకల్ బాయ్ రవిచంద్రన్ అశ్విన్ రెండో టెస్టులో 5 వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్ పతనాన్ని శాసించాడు. అశ్విన్ టెస్టుల్లో 5 వికెట్ల ప్రదర్శన చేయడం ఇది 29వ సారి. ఇక ఈ క్రమంలో అశ్విన్ టర్బొనేటర్ హర్భజన్ సింగ్ రికార్డును బద్దలు కొట్టాడు. స్వదేశంలో ఆడిన టెస్టుల్లో హర్భజన్ సింగ్ 264 వికెట్లు పడగొట్టాడు. కాగా, లంచ్ విరామానికి ముందు డామ్ సిబ్లే, డాన్ లారెన్స్ వికెట్లు పడగొట్టి భజ్జీ రికార్డును సమం చేసిన అశ్విన్.. లంచ్ తర్వాత బెన్ స్టోక్స్‌ను క్లీన్ బౌల్డ్ చేసి 265 వికెట్లతో హర్భజన్ రికార్డును బద్దలు కొట్టాడు. కాగా, మ్యాచ్ ముగిసే సమయానికి అశ్విన్ ఖాతాలో 267 వికెట్లు ఉన్నాయి. కేవలం 45 టెస్టుల్లో 22.64 సగటుతో రవిచంద్రన్ ఈ వికెట్లు తీశాడు. కాగా ఇండియాలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అనిల్ కుంబ్లే (350) అగ్రస్థానంలో ఉన్నాడు. మరోవైపు అశ్విన్ టెస్టుల్లో మొత్తం 391 వికెట్లు తీశాడు. మరో 9 వికెట్లు తీస్తే 400 వికెట్ల క్లబ్‌లో చేరతాడు. అశ్విన్ ఫామ్ చూస్తుంటే ఈ సిరీస్‌లోనే ఈ ఫీట్ అందుకునే అవకాశం కనపడుతున్నది.

Next Story

Most Viewed