మోకాళ్లపై నిలబడిన క్వింటన్ డికాక్

by  |
మోకాళ్లపై నిలబడిన క్వింటన్ డికాక్
X

దిశ, స్పోర్ట్స్: సౌతాఫ్రికా ఓపెనర్, వికెట్‌ కీపర్ క్వింటన్ డికాక్ ఎట్టకేలకు మోకాళ్లపై నిలబడి ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్‌’కు సంఘీభావం తెలిపాడు. టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా అన్ని జట్ల క్రికెటర్లు మ్యాచ్‌కు ముందు మోకాళ్లపై నిలబడి బీఎల్ఎం ఉద్యమానికి మద్దతు తెలుపుతున్న సంగతి తెలిసిందే. వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్ సందర్భంగా సౌత్ఆఫ్రికా క్రికెటర్లు అందరూ మోకాళ్లపై నిలబడాలని ఆదేశ క్రికెట్ బోర్డు ఆదేశాలుజారీ చేసింది.

దీంతో క్వింటన్ డికాక్ మ్యాచ్‌కు అరగంట ముందు తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. మోకాళ్లపై నిలబడాల్సి వస్తుందనే డికాక్ మ్యాచ్ నుంచి తప్పుకున్నట్లు విమర్శలు కూడా వచ్చాయి. అయితే ఆ తర్వాత రెండు రోజులకు డికాక్ దీనిపై వివరణ ఇచ్చాడు. తన హక్కులకు భంగం కలుగుతుందన్న బాధతోనే మ్యాచ్ నుంచి తప్పుకున్నానని అన్నాడు.

అయితే తాజాగా సీఎస్ఏ అధికారులు బీఎల్ఎం ఉద్యమంపై తనకు అవగాహన కల్పించారని.. ఆ ఉద్యమానికి సంఘీభావం ప్రకటించడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని డికాక్ చెప్పాడు. ఎట్టకేలకు శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌కు ముందు మోకాళ్లపైనిలబడి డికాక్ తనపై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టాడు.

Next Story

Most Viewed