ఫోర్టీస్ హెల్త్‌కేర్ నికర నష్టం రూ. 188 కోట్లు

by  |
ఫోర్టీస్ హెల్త్‌కేర్ నికర నష్టం రూ. 188 కోట్లు
X

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19(kovid-19 ) ప్రభావం కారణంగా జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో ఫోర్టీస్ హెల్త్‌కేర్ (Fortis Healthcare) రూ. 187.88 నికర నష్టాలను నమోదు చేసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ. 78.01 కోట్ల నికర లాభాల (Net profit)ను ఆర్జించినట్టు వెల్లడించింది. సమీక్షించిన త్రైమాసికంలో కంపెనీ కార్యకలాపాల ఆదాయం రూ. 605.95 కోట్లుగా ఉంది. ఇంతకుముందు ఆర్థిక సంవత్సరం (Financial year) ఇదే కాలంలో రూ. 1,138.31 కోట్లుగా నమోదు చేసింది. ఈ త్రైమాసిక ఫలితాలు ప్రస్తుత ఏడాది ప్రారంభమైన కొవిడ్-19 (kovid-19 ), లాక్‌డౌన్ వల్ల ప్రభావితమయ్యాయని ఫోర్టీస్ హెల్త్‌కేర్ (Fortis Healthcare) రెగ్యులేటర్ ఫైలింగ్‌లో వెల్లడించింది.

మే నెలలో క్రమంగా ఆర్థిక వ్యవస్థ (Economy) తిరిగి ప్రారంభమవడంతో వ్యాపారం మెరుగుపడిందని, రానున్న నెలల్లో ఇది మరింత పెరిగే అవకాశాలున్నాయని కంపెనీ పేర్కొంది. అయితే, ప్రస్తుత సవాళ్లను అధిగమించి కరోనాకు ముందున్న స్థాయి రికవరీ ఊహించిన దానికంటే నెమ్మదిగా ఉంటుందని ఫోర్టిస్ హెల్త్‌కేర్ (Fortis Healthcare)ఎండీ, సీఈవో అశుతోష్ రఘువంశీ తైపారు. ఈ త్రైమాసికలో మొత్తం డయాగ్నస్టిక్ వ్యాపార ఆదాయాలు (Diagnostic business earnings) కొవిడ్-19 (kovid-19 )ముందు నాటి దాంట్లో జూన్‌లో 80 శాతం, జులై నెలల్లో 86 శాతానికి చేరినట్టు కంపెనీ పేర్కొంది.

సువెన్ ఫార్మాస్యూటికల్స్ నికర లాభం రూ. 91.52 కోట్లు…

ప్రముఖ ఔషధ సంస్థ సువెన్ ఫార్మాస్యూటికల్స్ (Suven Pharmaceuticals) 2020-21 ఆర్థిక సంవత్సరానికి జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం 0.41 శాతం క్షీణించి రూ. 91.52 కోట్లుగా నమోదు చేసింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (Financial year) ఇదే త్రైమాసికానికి కంపెనీ రూ. 91.90 కోట్ల నికర లాభాలను నమోదు చేసింది.

సమీక్షించిన త్రైమాసికంలో కంపెనీ ఏకీకృత ఆదాయం (Consolidated income) రూ. 243.97 కోట్లుగా ఉందని, గతేడాది ఇదే త్రైమాసికానికి రూ. 199.83 కోట్లుగా నమోదైనట్టు రెగ్యులేటరీ ఫైలింగ్‌ (Regulatory Filing)లో పేర్కొంది. సంస్థ ఈక్విటీ వాటాదారుల (Company Equity Shareholders) వద్ద ఉన్న ప్రతి ఈక్విటీ వాటాకు ఒక బోనస్ వాటాను జారీ చేసేందుకు కంపెనీ బోర్డు ఆమోదం తెలిపిందని ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌ (Exchange filing)లో వెల్లడించింది.



Next Story

Most Viewed