కొడంగల్‌లో ఓటు వేసిన సీఎం రేవంత్ రెడ్డి

by Satheesh |
కొడంగల్‌లో ఓటు వేసిన సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సొంత ఇలాకా కొడంగల్‌లోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రంలో కుటుంబ సభ్యులతో కలిసి సీఎం ఓటు వేశారు. ఓటు వేసిన అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రతీ ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. మంత్రి సీతక్క ములుగు జిల్లాలోని జగ్గన్నపేటలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మధిర కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. ఖమ్మం జిల్లాలోని గొల్లగూడెంలో మంత్రి తుమ్మల ఓటు వేశారు. కల్లూరు మండలం నారాయణపురంలో ఓటు వేశారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. కాగా, తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. ఇవాళ ఉదయం 7 గంటలకు మొదలైన ఓటింగ్ సాయంత్రం 6 గంటలకు ముగియనుంది.

Next Story

Most Viewed