చక్‌దే చాహర్.. పంజాబ్ టాప్ ఆర్డర్ ఢమాల్

by  |
చక్‌దే చాహర్.. పంజాబ్ టాప్ ఆర్డర్ ఢమాల్
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 8వ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ కింగ్స్‌కు ఆదిలోనే దెబ్బపడింది. బ్యాటింగ్ ఆర్డర్‌లో కీలకమైన టాప్ ఆర్డర్ కుప్పకూలింది. దీపక్ చాహర్ వేసిన తొలి ఓవర్‌లోనే మయాంక్ అగర్వాల్ (0) డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ వచ్చాడు. ఇక రాహుల్, గేల్ కలిసి స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్తారని భావించిన పంజాబ్ అభిమానులకు అంతలోనే మరో షాక్ తగిలింది.

మూడో ఓవర్‌లో కేఎల్ రాహుల్‌(5)ను రవీంద్ర జడేజా రనౌట్ చేశాడు. దీంతో కేవలం 15 పరుగులకే పంజాబ్ కింగ్స్ ఓపెనర్లను కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి దీపక్ హుడా వచ్చాడు. ఇంతలోనే దీపక్ చాహర్ క్రిస్ గేల్ వికెట్ తీసుకున్నాడు. ఐదో ఓవర్‌లో గేల్ (10) వ్యక్తిగత పరుగుల వద్ద జడేజాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఇక ఇదే ఉత్సాహంలో ఉన్న చాహర్ మిడిలార్డర్‌లో నికోలస్ పూరన్‌ను(0) డకౌట్ చేశాడు. దీంతో 19 పరుగులకే పంజాబ్ కింగ్స్ 4 వికెట్లు కోల్పోయింది. పంజాబ్‌ బ్యాట్స్‌మెన్లను బెంబేలెత్తించిన దీపక్.. 7వ ఓవర్‌లో మరోసారి తన మార్క్ కనబర్చాడు. ఎట్టకేలకు దీపక్ హుడా (10)ను కూడా క్యాచ్ అవుట్ చేసి పెవిలియన్ పంపాడు. దీంతో కేవలం 26 పరుగులకే పంజాబ్ కింగ్స్ 5 కీలక వికెట్లను కోల్పోయింది. మొత్తం నాలుగు ఓవర్లు వేసిన చాహర్ 13 పరుగులు మాత్రమే ఇచ్చి 4 కీలక వికెట్లు తీసుకోవడం విశేషం. ప్రస్తుతం క్రీజులో షారూక్ ఖాన్, రిచర్డ్‌సన్ ఉన్నారు. తొలి 10 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ స్కోర్ 48/5గా ఉంది.


Next Story

Most Viewed