ఖమ్మం బాలిక కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

by  |

దిశ, పాలేరు:
ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం పల్లెగూడెం గ్రామానికి చెందిన బాలిక కుటుంబాన్ని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పరామర్శించారు. కాలిన గాయాలతో హైదరాబాద్ ఆస్పత్రిలో గత పదిరోజులుగా చికిత్స పొందుతూ గురువారం రాత్రి మరణించింది. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శుక్రవారం పల్లెగూడెం వెళ్లి బాలిక భౌతికాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మంత్రి వెంట జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్, పోలీస్ కమీషనర్ తఫ్సిర్ ఇక్బాల్,రూరల్ ఏసీపీ వెంకట్ రెడ్డి, జెడ్పీటీసీ బెల్లం ఉమ, తదితరులు ఉన్నారు.

ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ.. బాలిక తల్లిదండ్రులకు ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని, ఆదుకుంటుందని ధీమా కల్పించారు. దురదృష్టవశాత్తు తీవ్రంగా గాయపడిన బాలిక వైద్యం అందించినప్పటికీ గత రాత్రి మరణించడం బాధాకరమని అన్నారు. బాలిక కుటుంబానికి కావాల్సిన సాయాన్ని ప్రభుత్వం తరపున రూ.2 లక్షల అందజేశారు.

FOLLOW US ON ► Facebook , Google News , Twitter , Koo , ShareChat , Telegram , Disha TV

Next Story