మోడీ కీలక నిర్ణయం.. ‘కిషన్ రెడ్డి’కి ప్రమోషన్

by  |
kishan-Reddy
X

దిశ, తెలంగాణ బ్యూరో : కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డికి పదోన్నతి లభించే అవకాశం ఉంది. ప్రస్తుతం సహాయ మంత్రిగా ఉన్న ఆయనకు స్వతంత్ర హోదా కల్పించనున్నట్లు తెలిసింది. వ్యవసాయ శాఖ నుంచి సహకార శాఖను వేరు చేసినందువల్ల స్వతంత్ర హోదాలో పనిచేసే ఆ మంత్రిత్వశాఖకు కిషన్‌రెడ్డిని నియమించే అవకాశం ఉంది. ఈరోజు సాయంత్రం కేంద్ర మంత్రి వర్గాన్ని విస్తరించనుండటంతో ప్రధానిని కలిసిన 27 మందిలో కిషన్ రెడ్డి కూడా ఒకరు. కేబినెట్ మంత్రి అయ్యే అవకాశాలున్నట్లు ఢిల్లీ బీజేపీ వర్గాలు చెప్పినప్పటికీ ప్రస్తుతానికి స్వతంత్ర హోదా కల్పించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ప్రధానితో భేటీ సందర్భంగా సాయంత్రం ఆయనకు ఏ మంత్రిత్వశాఖ బాధ్యతలు అప్పజెప్పేదీ వివరించినట్లు తెలిసింది.

మొత్తం ముగ్గురు మంత్రులకు పదోన్నతి లభించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. అందులో కిషన్ రెడ్డితో పాటు అనురాగ్ ఠాకూర్, పురుషోత్తం రూపాల కూడా ఉన్నారు. మంత్రివర్గం నుంచి ఉద్వాసనకు గురయ్యే ముగ్గురు ఇప్పటికే రాజీనామా చేశారు. ఉన్నత విద్య(హెచ్ఆర్‌డీ) మంత్రిగా ఉన్న రమేష్ పోఖ్రియాల్ నిషాంక్, సంతోష్ గాంగ్వర్ తదితరులు రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా ఉన్న అనురాగ్ ఠాకూర్ ఇకపైన కార్మిక శాఖ మంత్రి కానున్నట్లు తెలిసింది. ఆయన కోసమే సంతోష్ గాంగ్వర్‌ను తప్పించినట్లు సమాచారం.

Next Story

Most Viewed