సామాన్యుడికి ఫోన్ చేసిన రాష్ట్రపతి.. రాలేనంటూ సమాధానం..!

by  |
సామాన్యుడికి ఫోన్ చేసిన రాష్ట్రపతి.. రాలేనంటూ సమాధానం..!
X

దిశ, జడ్చర్ల: మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల పట్టణానికి చెందిన సామాజికవేత్త అనిల్ కుమార్‌కు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఫోన్ చేసి మాట్లాడారు. జడ్చర్లలోని గాంధీ ట్రస్టులో అక్టోబర్ 2న ఏర్పాటు చేయనున్న గాంధీ విగ్రహావిష్కరణకు రాష్ట్రపతితో పాటు ప్రధానమంత్రి, కేంద్ర హోం మంత్రికి పోస్టు ద్వారా ఆహ్వాన పత్రాలను పంపినట్లు అనిల్ కుమార్ తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం ఉదయం 09:57 నిమిషాలకు రాష్ట్రపతి భవన్ నుంచి ఫోన్ వచ్చిందని.. రాష్ట్రపతి తన పేరు అడిగి పరిచయం చేసుకుని జడ్చర్లలో గాంధీ విగ్రహ ఆవిష్కరణకు రాలేకపోతున్నానన్నారు. ఆ రోజు బిజీ షెడ్యూల్ ఉన్నట్లు తెలిపారన్నారు. దీంతో మిమ్మల్ని కలవడానికి అవకాశం ఇవ్వాలని రాష్ట్రపతిని అనిల్ కుమార్ కోరగా త్వరలోనే సమాచారం ఇస్తామని వెల్లడించినట్టు చెప్పారు. రాష్ట్రపతి స్వయంగా తనకు ఫోన్ చేసి రెండు నిమిషాల ఐదు సెకండ్ల పాటు మాట్లాడడం మరిచిపోలేని అనుభూతిని ఇచ్చిందని సామాజికవేత్త అనిల్ కుమార్ అన్నారు. ఒక సామాన్యుడికి దేశ ప్రథమ పౌరుడు ఫోన్ చేయడం పట్ల పట్టణంలోని పలువురు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Next Story

Most Viewed