శ్రామిక్ ట్రైన్‌లో ప్రసవం.. తల్లీ బిడ్డ క్షేమం: రైల్వే శాఖ

by  |
శ్రామిక్ ట్రైన్‌లో ప్రసవం.. తల్లీ బిడ్డ క్షేమం: రైల్వే శాఖ
X

న్యూఢిల్లీ: వలస కూలీలను సొంతూళ్లకు తరలిస్తున్న శ్రామిక్ ట్రైన్‌లో ఓ మహిళ ప్రసవించింది. రైల్వే అధికారులు సకాలంలో స్పందించి చర్యలు తీసుకోవడంతో తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నారు. గుజరాత్‌లోని సూరత్ నుంచి బీహార్‌లోని నవాడాకు వెళ్లుతున్న ఓ గర్భిణీకి ట్రైన్‌లోనే పురిటినొప్పులు వచ్చాయి. ఈ విషయం తెలుసుకున్న రైల్వే అధికారులు సాధారణంగా రెండే స్టాప్‌లు(ప్రారంభం, గమ్యం) ఉండే శ్రామిక్ ట్రైన్‌ను మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా ఆగ్రాలో ఆపారు. వెంటనే డాక్టర్ పుల్కిత ట్రైన్ ఎక్కి చికిత్స ప్రారంభించారు. మహిళ ప్రసవించిన అనంతరం ఆ శిశువు ఫొటోను జత చేసి తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నారని ఇండియన్ రైల్వే ట్వీట్ చేసింది. మే 1 నుంచి ప్రారంభమైన ఈ శ్రామిక్ రైళ్లలో ఇప్పటి వరకు 20 మంది జన్మించారని ఈ సందర్భంగా గుర్తు చేసింది.

Next Story

Most Viewed