వయోజనులకోసం అద్భుత పథకం.. ఏడాదికి రూ. 1.11లక్షలు పెన్షన్

by  |
వయోజనులకోసం అద్భుత పథకం.. ఏడాదికి రూ. 1.11లక్షలు పెన్షన్
X

దిశ, వెబ్‌డెస్క్ : కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను అందిస్తోంది. అందులో భాగంగానే సీనియర్ సిటిజన్స్ లక్ష్యంగా ప్రధాన్ మంత్రి వయ వందన యోజన Pradhan Mantri Vaya Vandana Yojana పథకాన్ని తీసుకు రావడం జరిగింది. ఈ పథకం ద్వారా ఏడాదికి రూ. 1.11లక్షలు పెన్షన్ రూపంలో పొందవచ్చు.

డబ్బులు ఎలా వస్తాయి..

ఈ పథకం తీసుకోవాలి అనుకునేవారు ముందుగా రూ.15 లక్షలు పెట్టుబడిగా పెట్టాలి. దీని ద్వారా నెలకు కనీసం రూ.1000 పెన్షన్ తీసుకోవచ్చు. గరిష్టంగా రూ.9250 పొందొచ్చు. అంటే ఏడాదికి రూ.1.11 లక్షలు వస్తాయి. ఈ పథకాన్ని దేశీ దిగ్గజ బీమా రంగ కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా LIC ఈ పథకాన్ని అందిస్తోంది.

పథకం సంబంధించిన ముఖ్యమైన విషయాలు..

  • 60 ఏళ్లకు పైన ఉన్నవారు ఈ పథకంకు అర్హులు.
  • ఈ పథకం తీసుకోవాలంటే పాన్ కార్డు, అడ్రస్ ప్రూఫ్, బ్యాంక్ పాస్‌బుక్ జిరాక్స్ వంటి డాక్యుమెంట్లు తప్పని సరి.
  • ఈ పథకం కాలపరిమితి 10 సంవత్సరాలు.
  • ఈ పథకంలో చేరినట్లైతే 3 ఏళ్ల తర్వాత లోన్ కూడా తీసుకోవచ్చు.
  • ఈ పథకం 2023 మర్చి వరకు అందుబాటులో ఉంటుంది.
Next Story

Most Viewed