రూ.12 పొదుపుతో రూ. 2 లక్షల ఆదాయం

by  |
రూ.12 పొదుపుతో రూ. 2 లక్షల ఆదాయం
X

దిశ, వెబ్‌డెస్క్ : ఆర్థికంగా వెనుబడి ఉన్న వారి కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు తీసుకవచ్చింది. ఈ పథకాల ద్వారా ప్రజలకు లబ్ధి చేకూరుతోంది. అందులో ఒకటి ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన. ఇది ఒక బీమా పథకం. ఈ ప్రీమియం తీసుకుంటే కుటుంబానికి ఆర్థిక భద్రత ఉంటుంది. పేద ప్రజలు అధిక ప్రీమియం చెల్లించడం సాధ్యం కాదు, అలాంటి వారికి సహాయం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన పథకంను తీసుకొచ్చింది. దీనిలో సంవత్సరానికి కేవలం 12 రూపాయల ప్రీమియం చెల్లించడం ద్వారా రూ. 2 లక్షల వరకు భీమా పొందవచ్చు. బలహీన వర్గాల ప్రజల భవిష్యత్తును భద్రతతోపాటు.. కుటుంబ సభ్యులు సురక్షితంగా ఉండేందుకు ఈ పథకం సహాయపడుతోంది.

అర్హతలు..

  • ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన పథకంలో చేరాలి అనుకునే వారు 18 నుంచి 70 ఏళ్లలోపు వయస్సు ఉండాలి.
  • బ్యాంక్ అకౌంట్ తప్పనిసరి.
  • పథకంలో చేరే ముందే ఆటో డెబిట్ ఫెసిలిటీకి అంగీకారం తెలియజేయాల్సి ఉంటుంది.
  • ఈ పాలసీ వ్యవధీ ఒక సంవత్సరం.. ప్రతీ సంవత్సరం దీన్ని రెన్యూవల్ చేసుకోవచ్చు.
  • ఈ పథకంలో చేరినట్టయితే బ్యాంక్ బ్యాలెన్స్ కనీసం రూ.12 ఉండేలా చూసుకోవాలి.
  • ఈ ఏడాది జూన్ 1 నుంచి వచ్చే ఏడాది మే 31 వరకు పాలసీ అందుబాటులో ఉంటుంది. తర్వాత మళ్లీ రెన్యూవల్ అవుతుంది.

డబ్బులు ఎలా వస్తాయి..

ఈ సురక్ష బీమా యోజన స్కీమ్‌లో చేరితే ఏడాదికి రూ.12 చెల్లించాలి. దీనితో రూ.2 లక్షల బెనిఫిట్ లభిస్తుంది. మే నెల చివరిలో ఈ ప్రీమియం డబ్బులు చెల్లించాలి. ఒకవేళ బ్యాంక్ ఖాతా కలిగిన వారు ఈ పాలసీ తీసుకుంటే డబ్బులు కూడా ఖాతా నుంచే ఆటోమేటిక్‌గా కట్ అవుతాయి.

పథకం అదనపు ప్రయోజనాలు…

ఇన్ని సంవత్సరాలు నేను బీమా కట్టాలా.. ఒక వేళ నాకు ఏమైనా ప్రమాదం జరిగినా, నేను చనిపోతే ఇన్ని రోజులు కష్టపడి సంపాదించిన డబ్బులు పాలసీ కట్టి వృధా అయిపోతుంది అనుకునేవారికి ఈ పథకం భరోసా నిస్తుంది. ఇది ప్రమాద బీమా పథకం. ప్రమాదాల్లో మరణించినా, శాశ్వత వైకల్యం పొందినా ఈ పథకం వర్తిస్తుంది. ఈ పథకంలో చేరినవాళ్లు ప్రమాదంలో మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు రూ.2 లక్షలు వస్తాయి. శాశ్వత వైకల్యం పొందినట్టయితే రూ.2 లక్ష బీమా అందిస్తుంది ప్రభుత్వం. పాక్షికంగా వైకల్యం పొందితే రూ.1 లక్ష జీవిత బీమా లభిస్తుంది. గుండెపోటు, సహజ మరణాలకు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకం వర్తించదు. కేవలం ప్రమాదాల్లో మరణాలకు మాత్రమే వర్తిస్తుంది.

ఎలా అప్లై చేయాలంటే..

ఈ పథకంలో చేరాలి అనకునే వారు మీ బ్యాంక్ అకౌంట్ ఉన్న బ్రాంచుకు వెళ్లి ప్రధాన్ మంత్రి సురక్ష బీమా పథకంలో చేరొచ్చు. ఆటోమేటిక్‌గా డబ్బులు కట్ అయ్యేందుకు అనుమతి ఇవ్వాలి. 70 ఏళ్లు దాటితే ఈ స్కీమ్ వర్తించదు. ఆధార్ కార్డును బ్యాంకు ఖాతాతో లింక్ చేయడం తప్పనిసరి. అలాగే ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా పాస్‌బుక్, వయస్సు ధృవీకరణ పత్రం, ఇన్ కామ్ సర్టిఫికెట్, పాస్‌పోర్ట్ సైజు ఫోటో కూడా తప్పనిసరి. మరీ ఇంకెందుకు లేటు మీ దగ్గరిలోని బ్యాంకులకు వెళ్లి వెంటనే పథకంలో చేరిపోండి.



Next Story

Most Viewed