భారత మార్కెట్లో విస్తరించేందుకు సిద్ధమవుతున్న పోర్టబుల్ పవర్ కంపెనీ!

by  |
ecoflow
X

దిశ, వెబ్‌డెస్క్: అమెరికాకు చెందిన ప్రముఖ పోర్టబుల్ విద్యుత్, పునరుత్పాదక విద్యుత్ పరిష్కార సంస్థ ఎకోఫ్లో వచ్చే ఏడాదిలో భారత మార్కెట్ లోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నట్టు కంపెనీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. తమ వినియోగదారుల నుంచి బలమైన మద్దతు తమ వస్తోందని, ప్రస్తుత పరిస్థితుల్లో కంపెనీని విస్తరించడానికి సరైన సమయంగా భావిస్తున్నామని ఎకోఫ్లో గ్లోబల్ మార్కెటింగ్ హెడ్ జెన్నీ జాంగ్ అన్నారు. 2022 లో దేశీయంగా తమ ఉత్పత్తులను ప్రారంభించేందుకు ప్రణాళికను ఇప్పటికే సిద్ధం చేయాలని, దీనికి సంబంధించి భారతీయ డీలర్ల తో చర్చలు జరుపుతున్నట్టు ఆమె చెప్పారు. ‘ఆర్థిక వృద్ధికి విద్యుత్ ఎంతో కీలకమైనది.

ముఖ్యంగా భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాన్ని సాధించడానికి ఇది చాలా అవసరం. సంస్థ కొత్త విస్తరణ ప్రణాళికతో హోమ్ బ్యాకప్, మోటార్‌బైక్, క్యాంపింగ్, నిర్మాణం, ఫిల్మ్ మేకింగ్ సహా అవసరమైన, అవుట్‌డో, ఇంకా ఇతర అవసరాలకు విద్యుత్ స్టోరేజీ ఉత్పత్తులను అధించడమే తమ లక్ష్యమని జెన్నీ జాంగ్ వివరించారు. ఈ ఏడాది అక్టోబర్‌లో భారత్ అత్యధికంగా 120 కోట్ల యూనిట్ల విద్యుత్ సరఫరా కొరతను నమోదు చేసింది. ఇది గత ఐదేళ్లలో అత్యధికం. ఈ నేపథ్యంలో వినియోగదారుల అవసరాలకు, జీవనశైలికి అనుగుణంగా ఉత్పత్తులను అధించనున్నట్టు కంపెనీ వెల్లడించింది.



Next Story

Most Viewed