ఓటు వేస్తేనే.. పోర్న్ సైట్ ఓపెన్

by  |
ఓటు వేస్తేనే.. పోర్న్ సైట్ ఓపెన్
X

దిశ, వెబ్‌డెస్క్: ‘ఓటు’ హక్కు వినియోగించుకోవడం ప్రతి ఒక్కరి విధి. కానీ చాలా మంది ఓటు వేసేందుకు ఆసక్తి చూపించరు. అలాంటి వారికోసమే ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు అవగాహన కార్యక్రమాలు చేపడుతుంటాయి. ఆ సంగతి పక్కనబెడితే తాజాగా అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రజల్లో ఓటు హక్కుపై అవగాహన కల్పించేందుకు ఓ పోర్న్ సైట్ వినూత్న ఐడియాతో తమ వినియోగదారులను ఆశ్చర్యపరిచింది.

ఒక్క ఓటుతో ఎన్నికల ఫలితాలే మారిపోతాయి. చరిత్రలో అలా జరిగిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. అందుకే అమెరికాలో ఎన్నికల రోజున.. పోర్న్ హబ్ బ్రాండ్ అంబాసిడర్ అసా అకిరా.. ‘జస్ట్ ఫర్ ఫన్’ అనే క్రియేటివ్ ఏజెన్సీతో కలిసి ‘గివ్ ఫక్.. గెట్ ఫక్’ అనే క్యాంపెయిన్ రన్ చేశాడు. ఇందులో భాగంగానే అమెరికా ఎన్నికల్లో ఎవరైతే ఓటేస్తారో వారికే తమ పోర్న్ హబ్ వెబ్‌సైట్‌లోకి అనుమతిస్తామని ప్రకటించింది. నవంబరు 3న ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పోర్న్ హబ్ వెబ్‌సైట్‌లో ఓటు వేశారా? లేదా అనే ప్రశ్న కనిపిస్తుంది. ఓటు హక్కు వినియోగించుకున్నవారు ‘ఎస్’ అని టిక్ చేస్తారు. మరి చేయని వారి పరిస్థితి ఏంటి? అంటారా? ఓటు హక్కు ఉపయోగించుకోని వారు ‘ఎస్’ నొక్కినా సైట్ ఓపెన్ అవుతుంది. మరి దీని వల్ల ఆ క్యాంపెయిన్ స్టార్ట్ చేసి ఏం లాభం అంటారా? ఆ ప్రశ్న చూసి కొందరైనా ఓటు వేస్తారనే ఉద్దేశంతోనే ఈ పని చేశామని సైట్ నిర్వహకులు వెల్లడించడం విశేషం.

‘2016లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో సుమారు 43 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు. అంటే.. సుమారు 100 మిలియన్ ప్రజలు పోలింగ్‌కు దూరంగా ఉన్నారు. అందుకే ఈసారి ప్రజలను ఓటు వేసేందుకు ప్రోత్సహించాలని నిర్ణయించుకున్నాం. అందుకే ఈ ప్రకటన చేస్తున్నాం’ అని ‘పోర్న్‌హబ్’ ఉపాధ్యక్షుడు కోరె ప్రైస్ తెలిపారు.

Next Story

Most Viewed