పూజా హెగ్దె కొత్త కోరిక.. తీరేదెప్పుడో..

188
pooja hegde

దిశ, వెబ్‌డెస్క్: బుట్టబొమ్మ పూజా హెగ్దె తన కొత్త కోరికను బయట పెట్టింది. దాంతో ఇప్పుడు అమ్మడి కోరికే సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఇటీవల మాల్దీవులకు వెళ్లిన పూజా.. అక్కడ బాగా ఎంజాయ్ చేసి తిరిగి వచ్చింది. అనంతరం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా నెట్‌ఫ్లిక్స్ ప్రమోషన్స్‌లో పాల్గొన్న బ్యూటీ తన కొరికను బయట పెట్టింది. తనకు ఛాలెంజింగ్‌గా ఉండే పాత్రలు చేయాలని ఉందని, అలాగని ఆఫ్‌బీట్ పాత్రలు కాదని చెప్పింది. అంతేకాకుండా తనకు వండర్ ఉమెన్ లాంటి పాత్ర చేయాలని అనిపిస్తోందని తన కోరిక బయటపెట్టింది.

అంటే.. అవకాశం దొరికితే అమ్మడు వండర్ ఉమెన్‌గా మారి ప్రపంచంలోని చెడును సంహరిస్తుందన్న మాట. అయితే ప్రస్తుతం బుట్టబొమ్మ కొరిక నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. అంతేకాకుండా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో తాను చేసిన స్టాండప్ కమెడియన్ పాత్ర మంచి ఆదరణ పొందిందని, ఇతర సినిమాల్లో తాను చేస్తున్న పాత్రలకు కూడా అదే విధంగా అందరినీ మెప్పించాలని కోరుకుంటున్నట్లు అమ్మడు చెప్పుకొచ్చింది.

డార్లింగ్ ఫ్యాన్స్‌కి హాట్ అప్ డేట్.. రేపే విడుదల