క్రాకర్స్‌పై నిషేధం.. అక్కడ పటాకులు మోగితే అంతే సంగతులు

by  |
క్రాకర్స్‌పై నిషేధం.. అక్కడ పటాకులు మోగితే అంతే సంగతులు
X

దిశ, వెబ్‌డెస్క్ : దీపావళి పండుగ రానున్న నేపథ్యంలో దేశరాజధాని ఢిల్లీలో క్రాకర్స్ వినియోగాన్ని జనవరి 1వరకు నిషేధించినట్టు కాలుష్య నియంత్రణ కమిటీ మంగళవారం స్పష్టం చేసింది. 2022 జనవరి 1 వరకు పటాకులు అమ్మినా.. పేల్చినా కఠిన చర్యలుంటాయని ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ ప్రకటించింది. పటాకులు కాల్చేందుకు గతేడాది కరోనా పాండమిక్‌లోనూ ప్రజలు గుమిగూడటం, కరోనా నిబంధనలు బ్రేక్ చేసినందుకు గాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

అంతేకాకుండా దేశరాజధానిలో ఇప్పటికే కాలుష్యం పెరిగిపోయినందున, దీపావళికి మతాబులు పేలిస్తే ఏర్పడే పొగమంచు, పొల్యూషన్ వలన ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఏర్పడతాయని ముందుగానే నిషేధం విధించినట్టు పలువురు భావిస్తున్నారు.

Next Story

Most Viewed