పది లక్షలు కాదు కనీసం పది ఎకరాలకు కూడా నీళ్లివ్వలేదు.. కేసీఆర్ పై వైఎస్ షర్మిల ఫైర్

by Dishafeatures2 |
YSRTP Chief YS Sharmila Visits Flood Affected Areas In Khammam
X

దిశ, వెబ్ డెస్క్: సీఎం కేసీఆర్ పై వైఎస్ ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. తన తొమ్మిదేళ్ల పాలనలో 10 లక్షలు కాదు కనీసం 10 ఎకరాలకు కూడా కేసీఆర్ నీళ్లివ్వలేదని ఆరోపించారు. దశాబ్ది ఉత్సవాల పేరుతో కేసీఆర్ సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నారని.. కానీ ఆయన చేసిందేమీ లేదని అన్నారు. ‘‘కష్టం ఒకరిదైతే..ప్రచారం మరొకరిది’’ లా కేసీఆర్ వ్యవహారం ఉందని విమర్శించారు. పాలమూరు కనీళ్లను చూసి సాగునీళ్ళు ఇచ్చింది అయితే..తట్టెడు మట్టి మోయని కేసీఆర్ తానే జలకళ తెచ్చినట్లు గఫ్ఫాలు కొట్టుకుంటున్నాడని అన్నారు. ఎన్నికల వేళ సోకు మాటలు చెప్పడం కాదు.. పాలమూరు ప్రాజెక్టులపై బహిరంగ చర్చకు సిద్ధమా ? అని ప్రశ్నించారు. పడావు బడ్డ బీడు భూముల్లో కృష్ణా జలాలు పారించిన ఘనత ఎవరిదో చర్చకు రాగలరా.? అని సవాలు విసిరారు.

నాడు వైఎస్ఆర్ జలయజ్ఞం కింద వేసిన పునాదులే నేడు కేసీఆర్ చెప్తున్న 20 లక్షల ఎకరాలకు సాగునీళ్ళు ఇచ్చే ప్రాజెక్టులు అని అన్నారు. కల్వకుర్తి ద్వారా 4 లక్షల ఎకరాలు, భీమా కింద 2 లక్షల ఎకరాలు, నెట్టెంపాడుతో 2 లక్షల ఎకరాలు, కోయిల్ సాగర్ కింద 60 వేల ఎకరాలు, గట్టు, తుమ్మిల్ల, సంగంబండ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రిజర్వాయర్లు.. ఇలా ఎన్నో ప్రాజెక్టులు వైఎస్ఆర్ హయాంలోనే మొదలయ్యాయని చెప్పారు. పాలమూరు-రంగారెడ్డి పేరు చెప్పి 35 వేల కోట్లు మెక్కారే తప్పా ఒక్క ఎకరాను తడిపింది లేదని, 3 ఏళ్లలో ప్రాజెక్ట్ పూర్తి అని చెప్పి 9 ఏళ్లలో 35 శాతం కూడా పనులు కాలేదని ఆరోపించారు. వైఎస్ఆర్ బతికి ఉంటే పాలమూరు ప్రాజెక్ట్ పూర్తై10 లక్షల ఎకరాలకు ఏనాడో సాగునీరు అందేదని అన్నారు.

పడావు బడ్డ పాలమూరు భూములకు సాగునీళ్ళు ఇచ్చిన అపర భగీరథుడు వైఎస్ఆర్ అయితే వెనుక బడ్డ జిల్లాలోనూ ప్రాజెక్టుల పేరు చెప్పి కమీషన్లు దండుకున్న దొంగ కేసీఆర్ అని మండిపడ్డారు. మహానేత హయాంలో మైగ్రేషన్ వద్దని ఇరిగేషన్ చేస్తే.. నేడు ఇరిగేషన్ పక్కన పెట్టి మైగ్రేషన్ వైపే మల్లేలా కేసీఆర్ పాలన ఉందని అన్నారు. రాష్ట్రం ఏర్పడి 9 ఏళ్ళైనా వలసలు ఆగలేదు.15 లక్షల మంది పాలమూరు బిడ్డలకు బొంబాయి, దుబాయ్ కష్టాలు తీరలేదన్న షర్మిల.. సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ మీదున్న ప్రేమ దొరకు పాలమూరు మీద లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యమ సమయంలో పార్లమెంట్ కి పంపిన గడ్డ పాలమూరు అని ఏనాడో దొర మరిచిపోయారని కేసీఆర్ పై ధ్వజమెత్తారు.

Also Read: ఆ సామెత కేసీఆర్‌కు సరిగ్గా సెట్ అవుతుంది: షర్మిల



Next Story

Most Viewed