విపక్షాల విభజించి పాలించే ఎత్తుగడలు చెల్లవు.. ఎంపీ విజయసాయిరెడ్డి

by Dishafeatures2 |
mp vijayasaireddy
X

దిశ, ఏపీ బ్యూరో: ఎప్పుడో బ్రిటిష్​ కాలం నాటి విభజించి పాలించే ఎత్తుగడలను ఇప్పుడు విపక్షాలు అనుసరిస్తే చెల్లవని ఎంపీ విజయసాయిరెడ్డి హితవు పలికారు. ఈమేరకు ఆయన ట్విట్టర్​ వేదికగా స్పందించారు. నాడు బ్రిటిష్​ పాలకులు కొన్ని కులాలను రెచ్చగొట్టేది. కొన్ని వెనుకబడిన, అణగారిన వర్గాలను మరింతగా తొక్కేసేది. రాజధానిలో వారుండరాదు. ఉంటే అడవుల్లో లేక ఊరవతల ఉండాలనే విధానం బ్రిటిష్​ పాలకులది. ఆ అవశేషాలను ఇప్పుడు ఏపీలోని విపక్షాల్లో కనిపిస్తున్నాయంటూ సాయిరెడ్డి ట్వీట్​ చేశారు. 1947కు ముందు ఇవన్నీ చెల్లుబాటయ్యాయి. ఇప్పుడు వీలుకాదంటూ ఆయన రాజధానిలో పేదలకు ఇళ్ల పట్టాల గురించి పరోక్షంగా విపక్షాలకు చురకలు వేశారు.


Next Story