ప్రధాని మోదీ ఆధ్వర్యంలో దేశం ప్రపంచంలోనే మూడో ఆర్థిక వ్యవస్థగా గుర్తింపు

by Disha Web Desk 3 |
ప్రధాని మోదీ ఆధ్వర్యంలో దేశం  ప్రపంచంలోనే మూడో ఆర్థిక వ్యవస్థగా గుర్తింపు
X

దిశ, అచ్చంపేట: శనివారం ఉదయం మార్నింగ్ వాక్‌లో భాగంగా జిల్లాలోని అచ్చంపేట మున్సిపల్ పట్టణ కేంద్రంలో పర్యటించిన పోతుగంటి రాములు.. నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి భరత్ ప్రసాద్‌కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయన ఎన్టీఆర్ స్టేడియం, పబ్లిక్ క్లబ్, టీ స్టాల్స్ వద్ద ప్రజలను కలిసి మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో తన తనయుడు నాగర్ కర్నూల్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి భరత్‌ను గెలిపించమని కోరారు.

అలానే ప్రధాని మోదీ ఆధ్వర్యంలో భారతదేశం ప్రపంచంలోనే మూడవ ఆర్థిక వ్యవస్థగా గుర్తింపు పొందిందని ఆయన అన్నారు. రానున్న ఎన్నికల్లో 400 సీట్లను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ప్రధాని మోడీ, తన తనయుడు భరత్ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. కాగా నాగర్ కర్నూల్ అభివృద్ధి కోసం యువకుడు అయిన భరత్ ప్రసాద్‌ను గెలిపించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. కాగా ఈ కార్యక్రమంలో బీజెపీ నాయకులు మోక్తాలా రేణయ్య, మంగ్య నాయక్, మండి కారి బాలాజి, శ్రీను నాయక్, పల్సా గోపాల్ యాదవ్, చందు లాల్ చౌహాన్, కృష్ణ చారి, అఖిల్, అమర్ పాల్గొన్నారు.

Next Story

Most Viewed