కల్వకుంట్ల పాలనతో అల్ల కల్లోలమైన రాష్ట్రం

by Disha Web Desk 9 |
కల్వకుంట్ల పాలనతో అల్ల కల్లోలమైన రాష్ట్రం
X

దిశ, తుంగతుర్తి: కల్వకుంట్ల పాలనలో రాష్ట్రమంతా అల్లకల్లోలమౌతోందని,అవినీతి అక్రమాలపై ప్రశ్నించే వారి గొంతు నొక్కుతున్నారని వైయస్సార్ టిపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఏపూరి సోమన్న ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు.నియోజకవర్గ కేంద్రమైన తుంగతుర్తిలో గురువారం భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ప్రజలు ఆశించిన తెలంగాణ మంట కలిసి దొరల చేతిలో బంది అయిందని అన్నారు.రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన 1200 మంది అమరుల ఆశయాలు కనుమరుగయ్యాయని పేర్కొంటూ తీవ్రస్థాయిలో మడిపడ్డారు.అక్రమ అరెస్టులు,లాటి చార్జీలు,దౌర్జన్యాలు, తదితర వాటితో తెలంగాణలో పాలన కొనసాగుతుందని దుయ్యబట్టారు.భూ అక్రమణలు,ఇసుక దందాలు,గంజాయి స్మగ్లింగ్,మద్యం మాఫియా,

తదితరవన్ని రాజ్య మేలుతున్నాయని విమర్శించారు. ఇందులో భాగంగానే ఎదిరించే కళాలు,గలాలపై పాలకులు ఉక్కు పాదాన్ని మోపుతున్నారని విమర్శించారు.అన్యాయాలను ఎత్తిచూపుతూ ప్రశ్నిస్తున్న తీన్మార్ మల్లన్న పై ప్రభుత్వం నిర్బంధాన్ని మోపిందని అన్నారు.ముఖ్యంగా తప్పు చేస్తే తన పిల్లలనైన వదిలిపెట్టేది లేదంటూ ఆర్భాటంగా చెప్పుకొచ్చిన సీఎం కెసిఆర్ చివరికి మద్యం కుంభకోణంలో ఇరుక్కుపోయిన తన బిడ్డ కవితను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాడని దుయ్యబట్టారు.వడగండ్ల వానతో సర్వం నష్టపోయి చావు బతుకుల మధ్య రైతాంగం కొట్టుమిట్టాడుతుంటే పాలకులు అవేమి పట్టకుండా తిరిగి అధికారంలోకి వచ్చేందుకు కుటిల ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు.ఎన్నికలు సమీపిస్తున్న దృష్ట్యా పాలకులు ఇచ్చే అమల్లో సాధ్యం కానీ హామీల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.

స్థానికేతరుల ద్వారా అభివృద్ధి ముందుకు సాగదని అన్నారు.త్వరలోనే నియోజకవర్గ వ్యాప్తంగా పాదయాత్ర నిర్వహిస్తూ గడప గడపను తాకుతూ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తామని పేర్కొన్నారు. ఇప్పటికే తాము తలపెట్టిన పాదయాత్ర పూర్తి కావాల్సి ఉండగా పార్టీ అభినేత్రి షర్మిల రాష్ట్రవ్యాప్త పర్యటన వల్ల వాయిదా పడిందని తెలిపారు.దీనిపై త్వరలోనే రూట్ మ్యాప్ షెడ్యూల్ ని ప్రకటిస్తామని తెలిపారు.ముఖ్యంగా ప్రజా సమస్యలు ఉన్నచోట ఏపూరి సోమన్న ముందుండి నిలబడతాడని స్పష్టం చేశారు. మండల పార్టీ అధ్యక్షులు పరమేష్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో యువజన విభాగం కోఆర్డినేటర్ సూరారపు బుచ్చి రాములు, యూత్, విద్యార్థి విభాగాల బాధ్యులు రాము, అనిల్,జిల్లా దళిత విభాగం అధ్యక్షుడు చంద్రశేఖర్, నాయకులు మల్లయ్య, చంద్రశేఖర్,వేణు,సురేందర్,తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.



Next Story

Most Viewed