మావోయిస్టుకి నివాళులర్పించిన మంత్రి సీతక్క.. నువ్వు మంత్రివా..?భగ్గుమన్న..!

by Disha Web Desk 3 |
మావోయిస్టుకి నివాళులర్పించిన మంత్రి సీతక్క.. నువ్వు మంత్రివా..?భగ్గుమన్న..!
X

దిశ వెబ్ డెస్క్: కాంగ్రెస్ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) మావోయిస్టుకి నివాళులర్పించారు. దీనితో ఆమెపై నెటిజన్స్ మండిపడుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల ఛతీస్ఘడ్‌లో జరిగిన కాంకేర్ ఎన్కౌంటర్‌లో భూపాల పల్లి జిల్లా చిట్యాల మండలానికి చెందిన మావోయిస్టు అగ్రనేత సిరిపల్లి సుధాకర్ అలియాస్ శంకరన్న ప్రాణాలను కోల్పోయారు. ఈ నేపథ్యంలో నేడు ములుగు జిల్లాలో పర్యటించిన సీతక్క శంకరన్న చిత్రపటానికి నివాళులు అర్పించారు.

అనంతరం శంకరన్న కుటుంబాన్ని పరామర్శించారు. కాగా గతంలో సీతక్క కూడా మొవోయిస్టుగా పని చేసిన విషయం తెలిసిందే. అయితే ఒక మంత్రి స్థానంలో ఉండి ఏంకౌటర్‌లో మరణించిన మావోయిస్టుకు సీతక్క నివాళులు అర్పించడాన్ని ప్రజలు తప్పు పడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. బుద్ధి ఎక్కడికి పోతుంది, మునుముందూ ఉగ్రవాదులకు నివాళులు అర్పించినా ఆశ్చర్యపోనవసం లేదని, పో మరీ.. ఇంకా ఎందుకు నీకు రాజకీయాలు అని మండిపడుతున్నారు.

అలానే మావోయిస్టుల దాడిలో చనిపోయిన పోలీసులను ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నిస్తున్నారు. చంపింది మీరే.. నివాళులులు అర్పించేది మీరేనా అని ఎద్దేవ చేస్తున్నారు. నువ్వు మంత్రివా.. లేక నక్సలైట్ అనుకుంటున్నావా..? ప్రభుత్వం తరుపున పోరాడి చనిపోయిన పోలీసులు నీకు కనిపించలేదా..? సిగ్గు లేదా నీకు, ఓ నక్సలైట్‌కి సపోర్ట్ చేస్తున్నావ్, నీకు మంత్రి పదవి ఇచ్చి తప్పు చేశారని నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.



Next Story

Most Viewed